Spread the love

వైకాపా ప్ర‌భుత్వానికి హైకోర్టులో మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. ప్ర‌భుత్వం అమూల్ తో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎటువంటి నిధులు ఖ‌ర్చు చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేశారు. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ సవాల్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *