Spread the love

ఉత్త‌ర‌ప్రదేశ్ పోలీసులు ఘోర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. ఓ వ్య‌క్తి మాస్క్ ధ‌రించ‌లేద‌ని అత‌ని చేతికి మేకులు కొట్టారు. ఆపై ఆ యువ‌కుడిని తీవ్రంగా కొట్టారు. బరేలీ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితుడి పేరు రంజిత్‌. అరచేతికి వెనుక వైపు.. పాదం మీద మేకులు గుచ్చడంతో ఆ నొప్పికి అతడు విలవిల్లాడుతున్న వీడియో నెట్‌లో వైరల్‌ అయింది! ఈ ఘటనపై రంజిత్‌ తల్లి శైలజా దేవీ ఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు నుంచి తప్పించుకునేందుకే రంజిత్‌ మేకులు గుచ్చుకున్నాడని పేర్కొన్నారు. మాస్క్‌ ధరించని రంజిత్‌పై కేసును నమోదు చేసినట్లు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *