Spread the love

కృష్ణా జిల్లా క‌లెక్ట‌రుగా జె.నివాస్ బుధ‌వారం నాడు మ‌చిలీప‌ట్నంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌లెక్ట‌ర్ గా ఉన్న ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బ‌దిలీ అయ్యారు. ఆయ‌న స్ధానంలో జె.నివాస్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న ఇంత‌కు ముందు శ్రీ‌కాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేశారు. అక్క‌డ నుండి ఆయ‌న కృష్ణా జిల్లాకు బ‌దిలీ అయ్యారు. జె.నివాస్ ఇంత‌కు ముందు విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ గా ప‌నిచేశారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన జె.నివాస్ త‌మిళ‌నాడుకు చెందిన‌వారు. ఆయ‌న మెకానిక‌ల్ ఇంజ‌నీరు పట్టాపొందారు. 2009లో యుపిఎస్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆయ‌న 45వ ర్యాంక్ సాధించారు. నివాస్ మొద‌ట అప్ప‌టి తూర్పు గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేస్తోన్న ముద్దాడ ర‌విచంద్ర మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో శిక్ష‌ణ పొందారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ గా ఆయ‌న‌కు మొదట పోస్టింగ్ వ‌చ్చింది. సబ్ కలెక్టర్ గా పని చేసిన కాలంలో గిరిజన లోతట్టు మత్స్యకారుల ప్రయోజనం కోసం ప్రత్యేకమైన గిరిజన మత్స్యకారుల సంఘాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ITDA POగా బదిలీ అయ్యారు. తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా సేవలందించారు.
విజ‌యవాడ అభివృద్ధి కోసం కృషి: ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా నియమితులై కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడం ద్వారా మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను క్రమబద్దీకరించారు. తద్వారా విజయవాడ కార్పోరేషన్ ను పరిశుభ్రమైన మిలియన్ నగరంగా నిలిపారు. స్వచ్ఛ భారత్ లో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతు మీదుగా అవార్డు అందుకున్నారు. సింగ్ నగర్ వద్ద మొట్ట మొదటి విజయవంతమైన బయోమైనింగ్ ప్రాజెక్టుకు నివాస్ మార్గదర్శకత్వం వహించారు. డంప్ యార్డు కొరకు 30 ఎకరాల విలువైన భూమిని శాస్త్రీయంగా సేక‌రించారు. విజయవాడ ప్రజలకు పరిశుభ్రమైన పర్యావరణహిత స్థలాన్ని సృష్టించడంపై ఆయన దృష్టి సారించారు. మొట్ట మొదటి ఫ్లైఓవర్ పార్క్ యఫ్ హెచ్ 20 పార్క్ ను సృష్టించారు.ఈ ఉద్యానవనం నెల రికార్డు కాలంలో సృష్టించబడింది.మొట్టమొదటి రివర్ ఫ్యూపుడ్ కోర్టు, పిల్లల కోసం వినోద కేంద్రాన్ని PPP మోడల్లో తీసుకువచ్చారు.ఇది విజయవాడ నగర పౌరులకు ప్రధాన హ్యాంగ్ అవుట్ స్థలంగా నిలిచింది. కమిషనరుగా ఉన్న కాలంలో స్మార్ట్ సొల్యూషన్ కోసం ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డు ఇన్నోవేషన్ కోసం స్కోచ్ అవార్డు మరియు VITలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులను అందుకున్నారు.ఘన వ్యర్ధాల సేకరణతో పాటు, బయోగ్యాస్ ప్లాంటు, వికేంద్రీకృత కంపోస్టు ప్లాంటులు, వర్మి కంపోష్టు ప్లాంట్లతో సహా వ్యర్ధాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడానికి సౌకర్యాలను సృష్టించారు.విజయవాడ ఆధునికీకరించిన పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చాలా మందిచే ప్రశంసించబడ్డాయి. విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ గా ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టి ప్ర‌జ‌లు ప్రశంస‌లు పొందిన నివాస్ క‌లెక్ట‌ర్ గా కృష్ణా జిల్లా అభివృద్ధికి మ‌రింత కృషి చేస్తార‌నే అభిప్రాయం జిల్లా ప్ర‌జ‌ల్లో ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *