Spread the love

కరోనా పుట్టినిల్లైన చైనాలో వైరస్ కొత్త స్ట్రెయిన్ బయటపడింది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో మళ్లీ పదుల సంఖ్యలో కరోనా కేసులు విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాలో ప్రతి రోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నా.. వారంతా విదేశాలకు చెందిన వారు కావడంతో తమ దేశంలో కరోనాను అంతమొందించామని చైనా చెప్పుకుంది. కానీ తాజాగా 20 మంది స్థానికులు మళ్లీ కరోనా బారిన పడడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్‌ నగరంలో గత వారం రోజుల్లో ఈ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తాజాగా బయటపడిన వేరియంట్ మునుపటి వేరియంట్లకంటే ప్రమాదకరమైనది, వ్యాప్తి కూడా ఉధృతంగా ఉంటుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌‌లో ప్రముఖంగా ఓ కథనం ప్రచురితమైంది.కాగా.. కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్‌ అన్వేషణలో భాగంగా లివాన్‌ జిల్లాలో శనివారం పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *