Spread the love

టీడీపీ పార్టీ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హించే మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. ప్ర‌తి ఏటా పెద్ద ఎత్తున్న నిర్వ‌హించే మ‌హానాడు క‌రోనా కార‌ణంగా డిజిట‌ల్ గా నిర్వ‌హిస్తున్నారు. మా తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని గూడూరు ఎరిక్షన్ బాబు ప్రవేశపెట్టారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఎనిమిది నుంచి పది వేల మంది ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో నమోదు చేసుకొని పాల్గొనేలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా మహానాడు సమావేశాలు నిర్వహించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ విభాగాలకు కలిపి దీనిని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం పదిహేను తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధ్రప్రదేశ్‌… ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *