Spread the love

త‌న‌ను అరెస్టు చేసిన స‌మ‌యంలో త‌న‌కు వ్య‌తిరేకంగా, అవాస్త‌వ క‌ధ‌నాలు ప్ర‌సారం చేసి, త‌న ప‌రువు, ప్రతిష్ట‌ల‌కు న‌ష్టం చేశార‌ని, దీనికి టివి9 వారం రోజుల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వైకాపా రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆ ఛాన‌ల్ కు లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. బోర్డు డైరెక్టర్ల‌లో ఒక‌రైన‌ జ‌గ‌ప‌తిరావుకు, సిఇఓ బ‌రున్ దాస్, మేనేజింగ్ ఎడిట‌ర్ ర‌జ‌నీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ ముర‌ళీకృష్ణ‌ను బాధ్యులుగా చేస్తూ ఆయ‌న లీగ‌ల్ నోటీసుల‌ను పంపించారు. కాగా త‌న‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన స‌మ‌యంలో త‌న ఫోన్ ను సీఐడీ పోలీసులు తీసుకున్నార‌ని, దాన్ని తిరిగి ఇవ్వాల‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు సీఐడీ పోలీసులకు లీగ‌ల్ నోటీసులు పంపించారు. త‌న ఫోన్ లో వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఉన్నాయ‌ని, అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్‌ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *