Spread the love

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎ్‌సకు భారీ షాక్‌ తగిలింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారు. వీణవంక మండలానికి చెందిన 7 గ్రామాల సర్పంచ్‌లు, వైస్‌ ఎంపీ పీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా రు. సోమవారం వీణవంక మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మారముల్ల కొంరయ్యతో పాటు 12 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారంతా వీణవంకలో ఈటలకు మద్దతుగా పదర్శన నిర్వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *