Spread the love

దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ను కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే అందిస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. ఈ రోజు జాతినుద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తుందని ప్ర‌క‌టించారు. రాష్ర్టాల‌కు కేంద్రం వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని, ఇక కేంద్ర ప‌రిధిలోనే పూర్తిగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ జ‌రుగుతుంద‌ని తెలిపారు. ప్ర‌వేట్ హాస్ప‌ట‌ల్స్ కు 25శాతం డోసులు ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. రాష్ట్రాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రమే వ్యాక్సిన్లు సమకూర్చి రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుందని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని, రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లపై సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *