Spread the love

ఉత్తర కొరియాలో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియదు. అంతలా జాగ్రత్త పడుతుంటాడు ఆ దేశ అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్. కరోనాతో పాటు కిందటి ఏడాది తుఫాన్లు, వరదలు దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీశాయి. దీనికి తోడు రష్యా-చైనాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతిని కూడా నిలిపివేసి బోర్డర్స్ సీల్ చేయడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. దేశ వ్యాప్తంగా లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. చైనా నుంచి అక్రమంగా సరుకులు రవాణా చేసే వారి ద్వారా ఈ విషయాలు బయటకొస్తున్నాయి. దీనిపై అనేకమంది జర్నలిస్టులు కూడా వార్తా కథనాలు ప్రచురిస్తున్నారు. దీంతో దేశంలో ఇంత దారుణ పరిస్థితులు ఏర్పడడానికి కిమ్ వైఫల్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *