Spread the love

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పన్నుల పేరుతో పీడిస్తున్నార‌ని, విపరీతంగా పన్నుల భారం మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత కుమారి కేశినేని శ్వేత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడు విజయవాడ నగరంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచుటకు నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమని, దీనివలన భవిష్యత్తులో నగరవాసులపై రూ.500 కోట్ల పైన భారం పడుతుందని తెలిపారు. పెంచిన ఇంటిపన్నులు కట్టాలంటే ప్రజలు ఆస్తులు అమ్ముకోవా ల్సిందేనని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పన్నులు పెంచబోమని వైకాపా ప్రభుత్వం మాట ఇచ్చి ఎన్నికలు ముగిసి 3 నెలలైనా కాకమునుపే పన్నుల పెంపు నోటిఫికేషన్ జారీ చేయడం ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరోనాతో తీవ్ర భయాందోళనతో ఆర్థికంగా పలు కష్టాలు పడుతున్నారు. వారిలో ధైర్యం నింపి వారి జీవన విధానం గాడినపడేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి ప్రజలు నుంచి పన్నులు ఎలా గుంజాలి, ఉన్న పన్నులు ఎలా పెంచాలి అనే విషయం మీద దృష్టిపెట్టి ప్రజలను పీడించే కార్యక్రమానికి వైసిపి ప్రభుత్వం సిద్ధ పడటాన్ని కేశినేని శ్వేత తీవ్రంగా ఖండించారు. సంక్షేమ పథకాలు ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వై సి పి ప్రభుత్వం ఒక చేతితోరూ.10 ఇచ్చి మరొక చేత్తోరూ.100 గుంజుకుంటున్నా రన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *