Spread the love

ఏడేళ్ల మోడీ ప‌రిపాల‌న అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌ల‌కే కాదు, ఆ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచే ఆర్ఎస్ఎస్ కు కూడా చిరాకు, ఆగ్ర‌హం, అస‌హ‌నం తెప్పిస్తున్నాయ‌ని, అందుకే మోడీ చేత రాజీనామా చేయించాల‌ని చూస్తున్నార‌ని, స‌మ‌యం, సంద‌ర్భం కోసం వారు వేచి చూస్తున్నారే మాట‌లు ఢిల్లీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం యువ‌త‌, మ‌ధ్యత‌ర‌గతి వ‌ర్గాల మ‌ద్ద‌తుతో బ్ర‌హ్మోండ‌మైన మెజార్టీతో అధికారంలోకి రాగలిగారు. నాడు వారు ఎన్నో ఆశ‌ల‌తో ఆయ‌న‌కు వారు అధికారం అప్ప‌గించారు. నాటి కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయ‌న ప్ర‌జ‌లు మోడీలో మోస‌య్య‌ను చూశారు. ఆయ‌న అధికారంలోకి వ‌స్తే భార‌త‌దేశంలో అవినీతి ఉండద‌ని, యువ‌త‌కు బ్ర‌హ్మాండమైన ఉపాధి ల‌భిస్తుంద‌ని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేర‌తామ‌ని, భార‌త‌దేశం ప్రపంచప‌టంలో ఒక ప్ర‌చంఢ‌శ‌క్తిగా మారుతుంద‌ని, త‌మ జీవితాలు మారిపోతాయ‌ని చాలా మంది ఆశించారు. అయితే ఈ ఏడేళ్ల మోడీ పాల‌న‌ను చూసిన వారు నేడు మౌనంగా,మూగ‌గా రోధిస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెగురు, ప్రాణాలు ద‌క్కితే చాలు అన్న‌ట్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.

నేటి ప్ర‌జ‌ల మాన‌సిక ప‌రిస్థితిపై ఆర్ఎస్ఎస్ వ‌ర్గాలు గుర్తించింద‌ని, ఇక ప్ర‌ధానిగా మోడీని సాగ‌నిస్తే బిజెపికి పుట్టగ‌తులు ఉండ‌వ‌ని, ఆయ‌న స్ధానంలో గ‌డ్క‌రీని నియ‌మించి పార్టీని నిల‌బెట్టుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఎప్పుడు మోడీని తొల‌గిస్తారో..స్ప‌ష్ట‌త లేదు. కొన్ని అంచ‌నాల ప్ర‌కారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు అయిన త‌రువాత తొల‌గిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తొమ్మిది నెల‌లు స‌మ‌యం ఉంది. ఈలోపు మోడీ గ్రాఫ్ పెరిగితే ఆయ‌న తొల‌గింపు వ్య‌వ‌హారం కొన్నాళ్లు వాయిదా ప‌డుతుందంటున్నారు. అదే స‌మయంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌ళ్లీ బిజెపి గెలిస్తే మోడీని కొన‌సాగించే అవ‌కాశాలు ఉంటాయి. అయితే యు.పిలో ప్ర‌స్తుతం బిజెపి ప‌రిస్థ‌తి అంత‌బాగాలేదు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో బిజెపి ఘోర ఓట‌మికి గురైంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో అక్క‌డ ఆ పార్టీ విజయం అంత తేలికేం కాదు.

ఇది ఇలా ఉంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండానే మోడీని తొల‌గిస్తార‌ని మ‌రి కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. దేశ‌వ్యాప్తంగా, వాస్త‌వానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న మోడీ మ‌రింత కాలం ప‌ద‌విలో కొన‌సాగే అవకాశాలు క‌నిపించ‌డం లేదు. స్వాతంత్ర్య భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇంత‌టి అప‌ఖ్యాతి పొందిన ప్ర‌ధాని ఎవ‌రూ లేరంటే అతిశ‌యోక్తిలేదు. ఇటీవ‌ల వ‌ర‌కూ అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ధానిగా పేరు తెచ్చుకున్న మోడీ క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మ‌యి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయారు. త‌న‌కు ఆప్తులైన వ్యాపారుల‌కు ల‌క్ష‌ల‌,వేల‌కోట్లు దోచిపెట్టినా, యువ‌త‌, ఉద్యోగులును, రైతుల‌ను ప‌ట్టించుకోక‌పోయినా నోరు తెర‌వ‌ని సామాన్యులు, మోడీ నిర్వాకం వ‌ల్ల ప్రాణాలు పోతుంటే ఇక భ‌రించ‌లేక ఆయ‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. అన్నివిధాలుగా విఫ‌ల‌మైన మోడీని కొన‌సాగించి అప్ర‌దిష్ట‌పాల‌య్యే క‌న్నా ఆయ‌న స్ధానంలో గ‌డ్క‌రీ వంటి నేత‌ల‌ను కూర్చోబెడితే కొంచెం ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌తాయోన‌న్న ఆశ ఆర్ఎస్ఎస్ లోనూ, బిజెపిలోనూ అంత‌ర్లీనంగా ఉంది.మొత్తం మీద మోడీని దించి, గ‌డ్క‌రీకి ప‌ద‌వి అప్ప‌గిస్తార‌నే అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *