Spread the love

క‌రోనా స‌మయంలో ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి భ‌లే వినోదాన్ని పంచుతోంది. వాళ్లు చేస్తోన్న కామెడీతో ప్ర‌జ‌లు త‌మ బాధ‌లను మ‌రిచిపోయి హాయిగా న‌వ్వేసుకుంటున్నారు. మ‌రి న‌వ్వ‌క ఏంచేస్తారు…? నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన ఆ పార్టీతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టిడిపి పొత్తు పెట్టుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతుంద‌ట‌. మొన్న జ‌రిగిన మ‌హానాడులో టిడిపి బిజెపితో పొత్తుకోసం తీర్మానం చేసింద‌ట‌. వాళ్ల‌తో పొత్తుకోసం చంద్ర‌బాబు దేహీ అంటూ అంగ‌లారుస్తున్నాడ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. 0.5 శాతం ఓట్లు క‌లిగిన పార్టీతో 39శాతం ఓట్లు క‌లిగిన పార్టీ ఆదుర్త‌ప‌డుతుందంటే న‌వ్వురాదా… అంటే ఈళ్ల కామెడీ ముందు ఈటీవీ జ‌భ‌ర్ధ‌స్త్ కూడా దిగదిడుపుగా ఉంటుందేమో…? క‌రోనాతో ప్ర‌జ‌లు విల‌విల లాడిపోతుంటే వారిని ఆదుకోవ‌డానికి కానీ, స‌హాయం చేయ‌డానికి కానీ ముందుకు రాని బిజెపి నేత‌లు అప్పుడే ఎన్నిక‌ల పొత్తుల గురించి మాట్లాడ‌డంతో వారికి ప్ర‌జ‌ల‌పై ఎటువంటి శ్ర‌ద్ధ ఉందో అర్ధం అవుతోంది.


అస‌లు టిడిపి మ‌హానాడులో చేసిన తీర్మానం ఏమిటి? దేశానికి ఉప‌యోగ‌ప‌డే అంశాల్లో కేంద్రానికి మ‌ద్ద‌తు ఇస్తాం అనీ, కేంద్రానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి అని కాదు. బిజెపితో పొత్తు ఉంటుంద‌ని ఎక్క‌డైనా చెప్పారా..? లేదు క‌దా..? మ‌రి దీనికి విప‌రీత అర్ధాలు తీసి, చంద్ర‌బాబు పొత్తుకోసం ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ప్ర‌చారం చేసుకోవడం ఏమిటి? కేంద్రానికి మ‌ద్దతు వేరు..పొత్తు వేరు..అనే సంగ‌తి బిజెపి నేత‌ల‌కు తెలియ‌దా..? తెలియ‌కేం తెలుసు..కానీ..త‌మ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను మ‌రుగున ర‌చ‌డానికి, త‌మ అస‌మ‌ర్థ‌త‌ను, చేత‌కానిత‌నాన్ని నుంచి ప్ర‌జల దృష్టిని మ‌ర‌లించ‌డానికే ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ శున‌కానందాన్ని పొందుతున్నారు. ప్ర‌పంచం మొత్తం వారి నిర్వాకంపై ఈస‌డిస్తుంటే..త‌మ‌తో క‌ల‌సి వ‌చ్చేవారెవ‌రూలేని ప‌రిస్థితుల్లో టిడిపి ప్ర‌క‌ట‌న‌ను వ‌క్రీక‌రించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నాలుగేళ్ల క్రిత‌మే ఆంధ్రాకు బిజెపి చేసిన ద్రోహాన్ని హ‌స్తిన సాక్షిగా ఎండ‌గ‌ట్టిన పార్టీ ఇప్పుడు వారితో పొత్తుకోరుకుంటోంద‌ని చెబితో ప్ర‌జ‌లు నోటితో న‌వ్వ‌రు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *