Spread the love

‘ఓ పిట్టకథ’ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఆయన హీరోగా వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కమ్మరి. రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. సంజయ్ రావ్ సరసన ఈ చిత్రంలో రోహిణి ముంజల్, సాధన హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజా రవీంద్ర, ప్రభాస్ శ్రీను, హేమ, ప్రగతి వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. 

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కథాంశంతో.. లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాము. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెడతాం అని తెలుపగా.. దర్శకుడు విఎస్ ఫణీంద్రన్ మాట్లాడుతూ.. సరికొత్త కథా కథనంతో తెరకెక్కించే సినిమా ఇది. ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆసక్తికర ప్రశ్న ప్రేమా? పెళ్ళా?.. అదే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విషయంలో నిర్మాత చాలా సపోర్ట్ అందిస్తున్నారు. ఆయనిచ్చిన సపోర్ట్‌తో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాం అని అన్నారు. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *