Spread the love

రాష్ట్ర ప్ర‌భుత్వం భారీగా ఐఎఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది. ప‌లువురు జిల్లా క‌లెక్ట‌రుల‌తో పాటు ప‌లువురు స‌బ్ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ అహ్మ‌ద్ను మైనార్టీ వెల్పేర్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మించారు. శ్రీ‌కాకుళం క‌లెక్ట‌ర్గా ప‌ని చేస్తోన్న జె.నివాస్ను కృష్ణా క‌లెక్ట‌ర్గా బ‌దిలీ చేశారు. ఆయ‌న స్ధానాన్ని ఎ.పి. ఆర్గోస్ ఎండిగా ఉన్న బాలాజీరావుతో భ‌ర్తీ చేశారు. అనంత‌పురం క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడిని విలేజ్ వార్డు సెక్ర‌ట‌రీగా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్ ఎండిగా ఉన్న నాగ‌ల‌క్ష్మిని అనంత‌పురం కలెక్ట‌ర్గా బ‌దిలీ చేశారు. పెందూరు స‌బ్ క‌లెక్ట‌ర్గా ఉన్న వెంక‌టేశ్వ‌ర స‌లిజ‌మ‌ల‌ను చిత్తూరు జాయింట్ క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. అనంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న టి.నిశాంతిని అనంత‌పురం జాయింట్ కలెక్ట‌ర్ గా నియ‌మించారు. గూడూరు స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న గోపాల‌కృష్ణ రోనంకిని ఐటిడిఎ పెడూరుకు బదిలీ చేశారు. మ‌ద‌నప‌ల్లె స‌బ్ కలెక్ట‌ర్ గా ఉన్న జాహ్న‌విని తూర్పుగోదావ‌రి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. న‌ర్సీప‌ట్నం స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న మౌర్య‌ను క‌ర్నూలు జాయింట్ క‌లెక్ట‌ర్ గా నియ‌మించారు. న‌ర్స‌రావుపేట స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న అజ‌య్ కుమార్ ను కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ గా బదిలీ చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న అనుప‌మ అంజ‌లిని గుంటూరు జెసిగా నియ‌మించారు. పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న ఖారేను నెల్లూరు జెసిగా బ‌దిలీ చేశారు. టెక్క‌లి స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న‌ సూర‌జ్ ధ‌నంజ‌య్ ను ప‌శ్చిమ గోదావ‌రి జెసిగా నియ‌మించారు. నంద్యాల స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న క‌ల్ప‌నాకుమారీని విశాఖ‌ప‌ట్నం జెసిగా బ‌దిలీ చేశారు. తెనాలి స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న మ‌యూర్ అశోక్ ను విజ‌య‌నగ‌రం జెసిగా నియ‌మించారు. అమ‌లాపురం స‌బ్ క‌లెక్ట‌ర్ గా ఉన్న హిమానుశ్ కౌశిక్ ను శ్రీ‌కాకుళం జెసిగా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఎపి ఆగ్రోస్ ఎండిగా ఎస్.కృష్ణ‌మూర్తిని నియ‌మించారు. భారీగా ఐఎఎస్ ల‌ను బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఐపిఎస్ లను బ‌దిలీ చేయ‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *