Spread the love

క‌రోనా రెండోవేవ్ ను ఎదుర్కోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైన న‌రేంద్ర‌మోడీ ప్రభుత్వం ఇప్పుడు మూడోవేవ్ పై అయినా జాగ్రత్త‌లు తీసుకుంటుందా..? లేక ఇదివ‌ర‌క‌టి వ‌లే ప్ర‌జ‌ల‌ను వారి మానాన వారిని వదిలేస్తుందా? క‌రోనా రెండో ద‌శ‌ను స‌రిగా ఎదుర్కోలేక ఇంటా బ‌య‌టా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న మోడీ ప్ర‌భుత్వం మూడో వేవ్ పై ఎటువంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చ‌ర్య‌లు తీనుకుంటుంది? క‌రోనా మొద‌టి ద‌శ అప్పుడు ఒక్క‌సారిగా లాక్డౌన్ ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. కార్మికులు, రైతులు, పేద‌వారు లాక్డౌన్ వ‌ల‌న తీవ్ర‌మైన ఇబ్బందులకు గుర‌య్యారు. వల‌స కార్మికులు లాక్డౌన్ వ‌ల్ల త‌మ స్వంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు వేల కొద్ది కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న వెళ్లారు. ల‌క్షల మంది వ‌ల‌స కార్మికులు కాలి న‌డ‌క‌న వెళుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఉపాధి లేక‌, తిండి లేక వేలాది మంది రోడ్ల‌పై వెళుతున్నా వారికి ప్ర‌భుత్వం స‌హాయం చేయ‌లేదు.
స‌రే… మొద‌టి ద‌శ ఏదో ర‌కంగా ముగిసిపోయినా తరువాత ద‌శ‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన దాఖ‌లాలు లేవు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లపై దృష్టి పెట్టి క‌రోనాను తేలిగ్గా తీసుకోవ‌డంతో దానికి భారీగా ప‌రిహారం చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. క‌రోనా టీకాలు వ‌చ్చినా వాటిని ప్ర‌జ‌లకు అందించ‌కుండా విదేశాల‌కు ఇచ్చేసి నింపాదిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో క‌రోనా ఉగ్ర రూపం దాల్చింది. రెండో ద‌శ‌లో ఆక్సిజ‌న్ లేక‌, హాస్ప‌ట‌ల్ లో ప‌డ‌క‌లు లేక‌, మందులు లేక క‌రోనా బాధితులు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల‌ వేలాది మంది ప్రాణాలు పోయాయి. ముందు చూపులేని ప్రభుత్వం వ‌ల్ల కోట్లాది మంది తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ ప‌రువు పోయింది. చిర‌కు పాకిస్తాన్ వంటి దేశంతో కూడా భార‌త్ శుద్దులు చెప్పించుకోవాల్సిన ప‌రిస్థితికి భార‌త్ కు పాలిక‌లు క‌ల్పించారు.
ఇప్పుడు మూడో ద‌శ పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నా ప్ర‌భుత్వ పెద్ద‌లు దీన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల ప్ర‌భుత్వ పెద్ద‌లు క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా రాబోయే ఉత్త‌రప్ర‌దేశ్ ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న మ‌హ్మారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా రాజ‌కీయ‌విష‌యాల‌కే ప్రాధాన్యత ఇవ్వ‌డంతోనే వారి దృష్టి దేనిపై ఉందో అర్ధం అవుతోంది. ఈ దేశ ప్ర‌జ‌లు ఏమైపోయినా ఫ‌ర్వాలేదు..త‌మ‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని చాటుకుంటున్న‌ట్లు వీరి చ‌ర్య‌ల ద్వార తెలుస్తోంది. ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు ముఖ్య‌మ‌ని భావిస్తే ముందుగా వ్యాక్సిన్ పంపిణీపై దృష్టి పెట్టాలి. అదే విధంగా హాస్ప‌ట‌ల్స్ లో మౌలిక వ‌స‌తుల‌పై దృష్టిసారించాలి. మ‌హ్మ‌రిని త‌రిమికొట్ట‌డానికి చిత్తశుద్ధితో ప‌నిచేయాలి. పాల‌కుల క‌న్నీళ్లు ప్ర‌జ‌ల మ‌ర‌ణాల‌ను ఆప‌లేవ‌నే సంగ‌తిని గుర్తుంచుకోవాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *