Spread the love

దేశ ప్ర‌జ‌లంద‌రికీ కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ వేస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టి దాకా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై కేంద్రం, రాష్ట్రాలు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు గుప్పించుకున్నాయి. దేశ‌మంతా ఒకే వ్యాక్సినేష‌న్ విధానం ఉండాల‌ని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉండ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదురువుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాని వేగంగా చేస్తూండ‌డం, మ‌రికొన్ని రాష్ట్రాలు మంద‌కొడిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ముందుగా అనుకున్న విధంగా సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నాటికి వ్యాక్సినేష‌న్ కార్యక్రమం పూర్తి కాద‌ని, దీంతో మూడోవేవ్ లేక నాల్లోవేవ్ ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్ననిపుణుల హెచ్చ‌రిక‌తో కేంద్రం వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని త‌న చేతిలోకి తీనుకుంది.
రెండో వేవ్ ను ఎదుర్కోవ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని, ఇంటా, బ‌య‌టా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు రావ‌డం, దీనికితోడు వ్యాక్సినేష‌న్ విధానంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో కేంద్రం ఈరోజు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. మోడీ ప్ర‌క‌ట‌న‌తో కొంత హ‌ర్షం వ్య‌క్తం అవుతున్నా..రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ డ్రైన్ ఎలా చేస్తాయ‌నే దానిపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాగా..నిన్న‌టి దాకా వ్యాక్పిన్ లు కొన‌లేద‌ని, రాష్ట్రంలో వ్యాక్సిన్ మంద‌కొడిగా సాగుతుంద‌ని, దీనికంత‌టికి జ‌గ‌న్ విధానాలే కారణ‌మ‌నే విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్ష‌పార్టీల నుంచి వ‌చ్చాయి. అయితే తాము వ్యాక్సిన్ కొనుగోలు చేయాల‌ని భావించినా వ్యాక్సిన్ దొర‌క‌టం లేద‌ని, పైగా తాము వ్యాక్పిన్ కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌కు వెళ్లామ‌ని, కానీ వ్యాక్సిన్ లు అందుబాటులో లేవ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.
వివిధ రాఫ్ట్రాల ముఖ్యమంత్రుల‌కు కూడా లేఖ‌లు రాసి, అంద‌రం ఒకే బాట‌లో నడ‌వాల‌ని , కేంద్రంపై ఒత్తిడి తేవాల‌న్నారు. కాగా దీనిపై కూడా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు కురిపించాయి. వేరే రాష్ట్రాలు గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తున్నాయ‌ని, సొమ్మ‌లు చెల్లించ‌కుండా వ్యాక్సిన్ లు రావ‌ని ధ్వ‌జ‌మ‌త్తాయి. వ్యాక్సిన్ల విష‌యంలో రాష్ట్రం తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న స‌మయంలో ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ కు సంతోషాన్ని క‌లిగించింది. ఇక వ్యాక్సిన్ విష‌యంలో రాష్ట్రం చేసేదేమీ ఉండదు. కేంద్ర‌మే దేశ‌మంతా వ్యాక్సిన్ ను అందిస్తుంది కాబ‌ట్టి వ్యాక్సిన్ బ‌రువు జ‌గ‌న్ మీద నుంచి త‌ప్పిపోయిన‌ట్లే. ఇక మీద‌ట కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌చ్చే వ్యాక్సిన్ వివిధ సెంట‌ర్ల‌లో ప్ర‌జ‌ల‌కు అందించ‌డ‌మే రాష్ర్ట ప్ర‌భుత్వ బాధ్య‌త‌. మొత్తం మీద తీవ్ర ఇక్క‌ట్ల‌లో ఉన్న స‌మ‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వ్యాక్సిన్ విధానం జ‌గ‌న్ లో ఆనందాన్ని నింపిఉంటుంది. కాగా..ఇప్పుడు కేంద్రం ప్ర‌క‌టించిన విధానంతో సంతోష‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, రేపు రాష్ట్రానికి కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల్లో ఈ వ్యాక్సిన్ ఖ‌ర్చుల‌ను కేంద్రం కోసివేస్తుంద‌నే మాట వినిపిస్తోంది. అయితే కేంద్రం ఖ‌ర్చుల‌ను మిన‌హాయించుకున్నా పెద్ద‌గా ఇబ్బంది ఏమీ లేద‌ని, అసలు ఎంత సొమ్ము ఖ‌ర్చుచేసినా వ్యాక్సిన్ దొర‌క‌ని సంద‌ర్భంలో తీవ్ర‌విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల్లో కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ ప్రభుత్వంపై ప‌న్నీటి జ‌ల్లులా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *