Spread the love

ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడిపై థ‌ర్ఢ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం పార్ల‌మెంట్ కు అవ‌మాన‌మ‌ని కేర‌ళ‌కు చెందిన ప్రేమ‌చంద‌న్ అన్నారు. ఎపి సీఐడీ పోలీసులు త‌న‌ను కొట్టార‌ని వైకాపా రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీలకు లేఖ రాశారు. ఈ లేఖ‌పై ప్రేమ‌చంద్ స్పందించారు. ర‌ఘురామ‌రాజుపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డాన్ని తాను ఖండిస్తున్నాన‌ని, ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడిపై ఈ విధంగా దాడి చేయ‌డం పార్ల‌మెంట్ పై దాడి చేయ‌డం వంటిద‌ని, ఇది పార్ల‌మెంట్ కు అవ‌మాన‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ విష‌యాన్ని తాను పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. కాగా ఇదే విష‌యంపై ప‌లువురు ఎంపీలు ర‌ఘ‌రామ‌రాజుకు మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు. సీఐడీ పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన త‌రువాత తన‌పై వారు ప్ర‌యోగించిన థ‌ర్డ్ డిగ్రీ గురించి, త‌న‌ను కొట్టిన విధానం గురించి, త‌న‌కు అయిన గాయాల గురించి ఫొటోల‌తో ఆయ‌న పార్లమెంట్ స‌భ్యుల‌కు లేఖ‌లు రాస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *