Spread the love

నాపేరు..డాక్ట‌ర్.సి.ఎల్. వెంక‌ట్రావు..అంటూ మెడ‌లో సెత‌స్కోపు వేసుకుని సోష‌ల్ మీడియాలో క‌రోనా రోగం గురించి ఒకాయ‌న ఒక‌టే స‌ల‌హాలు ఇస్తుంటాడు. సోష‌ల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈ వ్య‌క్తి బాగానే తెలుసు. కోవిద్ గురించి ఆయ‌న చెప్పే మాట‌లు బాగానే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టున్నాయి. చాలా మంది ఆయ‌న స‌ల‌హాల‌ను పాటించ‌డం కూడా జ‌రిగింది. మ‌రి కొంద‌రు ఆయ‌న క‌రోనా గురించి చెప్పే మాటల‌తో కొంచె ధైర్యం తెచ్చుకునేవారు. క‌రోనా విష‌యంలోనూ, ఇత‌ర ఆరోగ్య విష‌యాల‌పై ఆయ‌న విశ్లేష‌ణ బాగానే ఉండ‌డంతో ఒక్క‌సారిగా ఆయ‌న సెల‌బ్రిటీ హోదాను తెచ్చుకున్నారు. త‌న‌కు వ‌చ్చిన హోదాతో ఇంకేముంది..త‌న అంత‌టి వాడు లేడ‌న‌ట్లు తాను ఏం చెప్పినా ప్ర‌జ‌లు వేలం వెర్రిగా చూస్తారని ఫిక్స్ అయిపోయి, రాజ‌కీయ వీడియోలు చేయ‌డం మొద‌లు పెట్టాడు.
రాజ‌కీయ విశ్లేష‌ణ చేస్తే ప‌క్ష‌పాతం లేకుండా చేయాలి. కానీ మ‌నోడు వైకాపాకు వ‌త్తాసు ప‌లుకుతూ, ప్ర‌తిప‌క్ష టిడిపి, వైకాపా రెబ‌ల్ ఎంపి ర‌ఘురామ‌రాజును విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేస్తూ వారికి చెత్త స‌ల‌హాలు ఇస్తున్నాడు. దీంతో నిన్న‌టి దాకా డాక్ట‌ర్ గా ఆయ‌న‌ను అభిమానించిన చాలా మంది ఆయ‌న‌ను దూషిస్తూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. డాక్ట‌ర్ గా నీప‌ని నీవు చూసుకోకుండా రాజ‌కీయాలు, చ‌చ్చు సల‌హాలు ఎందుకు ఇస్తున్నావంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న‌టి దాకా ఆయ‌న‌ను అభిమానించ‌వారంతా కూడా ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నోరుమూసుకోమంటున్నారు.
ఆయ‌న‌పై ఇంత‌లా వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి కార‌ణం ఏమిటంటే..వైకాపా పెద్ద‌ల‌పై తిరుగుబాటు చేసిన ర‌ఘురామ‌రాజు వెళ్లి జ‌గ‌న్ తో రాజీ చేసుకోవాల‌ట‌. ర‌ఘురామ‌రాజు జ‌గ‌న్ వ‌ద్దకు వెళితే జ‌గ‌న్ పెద్ద మ‌న‌స్సుతో ఆయ‌న‌ను క్ష‌మిస్తార‌ని, కేసులు లేకుండా పోతాయ‌ని, ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకుండా రాజీప‌డాల‌ని డాక్ట‌ర్ స‌ల‌హా ఇస్తున్నారు. ఒక వేళ రాజీ ప‌డ‌క‌పోతే ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను కూడా ఆయ‌న ఏక‌రువు పెట్టాడు. మ‌హాభార‌తంలోని రాయ‌భారం సీన్ లో శ్రీ‌కృష్ణుడు చెప్పిన‌ట్లు…అట్లు రాజీప‌డ‌క‌పోయిన‌చో స‌ముద్రాల‌న్నీ ఏకంకాక‌పోను… అప్పుడు ప‌ది వేల మంది చంద్ర‌బాబులైనా, లోకేష్ లైనా, ప‌వ‌న్ లైనా జ‌గ‌న్ ఆగ్ర‌హానికి కొట్టుకుపోతార‌నట‌. ర‌ఘ శ్రేయ‌స్సుకోరి తాను చెప్పిన‌ట్లు రాజీ చేసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. రాజీకి వ‌స్తే వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఇప్పుడు సీఐడీ వాళ్లు పెట్టిన కేసుల‌తో పాటు, న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘుపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు ఎత్తేస్తార‌ట‌. అదే విధంగా మ‌రో మూడేళ్ల‌పాటు ఎంపిగా కొన‌సాగ‌వ‌చ్చున‌ని ఆయ‌న సెల‌విచ్చారు.
డాక్ట‌ర్ వెంక‌ట్రావు ఇచ్చిన స‌ల‌హాపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో దండెత్తున్నారు. నీవు డాక్ట‌ర్ వా లేక రాజ‌కీయ బ్రోక‌ర‌వా..? అంటూ దూషిస్తున్నారు. ధ‌ర్మం కోసం, ప్ర‌జ‌ల కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రఘుకు అండ‌గా లేక‌పోయినా ఫ‌ర్వాలేదు..కానీ ఇటువంటి చచ్చు, స‌న్నాసి స‌ల‌హాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఒకవేళ ఆయ‌న కేసుల భయంతో రాజీ ప‌డితే..ఆయ‌నపై పెట్టిన కేసుల‌న్నీ కావాల‌ని పెట్టిన‌ట్లే క‌దా..? రేపు ఎవ‌రు ప్ర‌శ్నించినా ఇలానే అక్ర‌మ కేస‌లు పెడ‌తారు క‌దా..అంద‌రూ రాజీ ప‌డిపోతే ప్ర‌శ్నించే వ్య‌క్తులు ఎవ‌రు ఉంటార‌ని, ప్ర‌శ్నించ‌క‌పోతే ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంటుంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తం మీద డాక్ట‌ర్ వెంక‌ట్రావు స‌చ్చు స‌ల‌హాలు ఇచ్చి నిన్న‌టిదాకా అభిమానించిన వారి నుంచే ఛీత్కారాల‌ను చ‌విచూస్తున్నారు.

తాజాక‌లం: ఈ సిఎల్ వెంక‌ట్రావు గ‌త సార్వ‌త్ర‌క ఎన్నిక‌ల్లో బిజెపి త‌రుపున గుడివాడ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఈయ‌న‌గారికి డిపాజిట్ గ‌ల్లంతు అయింది. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న సిఎం జ‌గ‌న్ ప్రాప‌కం కోసం ఆరాట‌ప‌డుతున్నారు. అందుకే వారు అడ‌క‌పోయినా ఏదో విధంగా వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తిప్ప‌లు ప‌డుతున్నార‌నే మాట వివిధ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే ర‌ఘురామ‌రాజు రాజీ ప‌డాల‌ని సూచిస్తున్నార‌ట‌. అన్న‌ట్లు వెంక‌ట్రావు మొద‌ట్లో టిడిపిలో ఉండేవారు. చంద్ర‌బాబు ఈయ‌న‌కే నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లు గుర్తు. ప‌ద‌విపోయాక అంద‌రూ తిట్టిన‌ట్లే ఇప్పుడు చంద్ర‌బాబును ఆయ‌న కుమారుడిని దూషిస్తున్నారు. కేవ‌లం దూషించ‌డ‌మే కాదు..వారిద్ద‌రినీ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో పెట్టాల‌ని కోరుతూ ప‌ద‌వి ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకుంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *