Spread the love

వైకాపా రెబ‌ల్ ఎంపి రఘురామ‌రాజు ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ కు లేఖ రాశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా అవ్వాతాతాల‌కు ఫించ‌న్ పెంచుతామ‌ని హామీ ఇచ్చామ‌ని ఆ హామీని నెర‌వేర్చుకోవాల‌ని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్పుడు వృద్ధుల ఫించ‌న్లు ప్ర‌తి ఏటా రూ.250/- పెంచుతామ‌ని హామీ ఇచ్చార‌ని, ఒక ఏడాది మాత్ర‌మే వారికి ఆ మేర‌కు పెంచార‌ని, రెండేళ్ల నుంచి వారికి పెంచ‌లేద‌ని, దాన్ని ఇప్పుడైనా పెంచాల‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రికి రాసిన లేఖ‌లో కోరారు. మే 2020లో వారికి మ‌రో రూ.250/- పెంచాల‌ని దాన్ని అప్పుడు పెంచ‌లేద‌ని, ఇప్పుడు మ‌రో ఏడాది గ‌డిచినందున మొత్తం రూ.2700/-ల‌ను వారికి జూన్ నుంచి అందించాల‌ని ర‌ఘురామ‌రాజు త‌న లేఖ‌లో డిమాండ్ చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వృద్ధులు మ‌నం ఇచ్చిన హామీ మేర‌కు మ‌న‌కు మ‌ద్దుతు ప‌లికార‌ని, వారికి ఇచ్చిన హామీ మేర‌కు వారికి ఇవ్వాల్సిన ఫింఛ‌న్ సొమ్ముల‌ను వెంట‌నే ఇవ్వాల‌న్నారు. గత ఏడాది నుంచి ఇవ్వాల్సిన రూ.250/-ల‌ను, జూన్ లో ఇవ్వాల్సిన రూ.250/- మొత్తం రూ.2700/-లు వారికి చెల్లించాల‌ని సూచించారు. పోయ‌న సంవ‌త్స‌రం బ‌కాయిల‌న్నింటిని వెంట‌నే చెల్లించాల‌ని, వృద్ధులు భగవంతుని ప్ర‌తిరూపాల‌ని వారికి వెంట‌నే న్యాయం చేయాల‌న్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *