Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల పద‌వీకాలాన్ని పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వుల‌ను జారీ చేసింది. పొలిటిక‌ల్ సల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల‌తో పాటు, త‌ల‌శిల ర‌ఘురాం, జి.వి.డి.కృష్ణ‌మోహ‌న్, అజ‌య్ క‌ల్లంల పద‌వీకాలం ఏడాదిపాటు పొడిగిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ నేడు ఉత్త‌ర్వులు జారీ చేశారు. రెండేళ్ల క్రితం వై.ఎస్. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే స‌జ్జ‌ల‌, అజ‌మ్ క‌ల్లం, ర‌ఘురాం, కృష్ణ‌మోహ‌న్ లను స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్నారు. వీరి త‌రువాత దాదాపు మ‌రో 30 మంది వ‌ర‌కు స‌ల‌హాదారుల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. వీరంద‌రి పద‌వీకాలం ఈనెలు 7వ తేదీతో పూర్తికానుంది. అయితే ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తోన్న పై నలుగురికి తిరిగి పద‌వీకాలం పొడిగిస్తూ ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేసింది. ఈ న‌లుగురు త‌ప్ప మిగితా 30 మంది స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశాల‌ను ఇస్తార‌ని తెలుస్తోంది.

కులాలు, వ‌ర్గాల ఆధారంగా మ‌రో 30 మందికి నూత‌నంగా సల‌హాదారులుగా అవ‌కాశాల‌ను క‌ల్పించ‌బోతోంది. ఎస్సీ వ‌ర్గాల‌కు చెందిన వారికి ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా మంత్రివ‌ర్గాన్ని కూడా మ‌రో ఐదు నెల‌ల్లో విస్త‌రించ‌బోతున్న నేప‌ధ్యంలో సామాజిక‌, ప్రాంతాల‌వారీగా, అన్నివ‌ర్గాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి సల‌హాదారుల‌ను నియ‌మిస్తార‌ని వైకాపా వ‌ర్గాలు అంటున్నాయి. ఇది ఇలా ఉంటే ప్ర‌భుత్వ సొమ్ముతో భారీగా స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకోవ‌డం స‌రికాద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నాయి. స‌ల‌హాదారుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏమి మేలు జ‌రిగిందో చెప్పాల‌ని ప్ర‌తిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రెండేళ్ల‌లో సల‌హాదారుల వ‌ల్ల వ‌రిగిందేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా ప్ర‌భుత్వం తాను చేయాల‌నుకున్న ప‌నుల‌ను చేసుకుంటూపోతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *