WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పట్టిసీమ' ఘనత ఆ ఇద్దరిదే...!

'పట్టిసీమ' ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన ఘనత మీ ఇద్దరిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అభినందించారట. ఇటీవల పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిగా ప్రారంభించిన అనంతరం జలవనరులశాఖ మంత్రి 'దేవినేని ఉమామహేశ్వరరావు'ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ 'భాస్కర్‌'ను ఆనందంతో అభినందించడం జరిగింది. ఇందులో నా ఘనత ఏమీ లేదని అధికారులందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని ఈ ఘనత కూడా వారికే దక్కుతుందని...ఆ తరువాత కలెక్టర్‌ను కలిసిన అధికారులతో ఆయన చెప్పారట. పట్టిసీమ ప్రాజెక్టును పట్టుదలతో పూర్తి చేశామని తాను రాత్రింభవళ్లు కష్టపడ్డానని ఆ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు చెబుతున్నారు. అంతే కాకుండా విపక్షాల విమర్శలకు ధీటుగా స్పందించి వాస్తవాలను ప్రజలకు తెలియపరిచానని కృష్ణాడెల్టా రైతాంగానికి అండగా ప్రభుత్వం నిలిచిందని, దీనికి ముఖ్యకారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి అంటున్నారు. వాస్తవానికి మంత్రి ఉమ, కలెక్టర్‌ భాస్కర్‌ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపి సకాలంలో పూర్తి చేయించారని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వందల కోట్లు చేతులుమారాయని విపక్షాల నాయకులు రాజకీయ విమర్శలు చేశారే తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉమ నిజాయితీగా పనిచేశారని, కలెక్టర్‌ భాస్కర్‌ అంత కన్నా ఎక్కువగా నిజాయితీపరుడని ఆ జిల్లా వాసులందరికి తెలుసనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 'పట్టిసీమ' ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల కృష్ణా డెల్టాలో మళ్లీ నారుమళ్లుపోసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినా..ఎవరెవరో ఎన్నో ఆరోపణలు చేసినా, కోర్టుల్లో కేసులు వేసినా వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి సకాలంలో 'పట్టిసీమ'ను పూర్తి చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమాతో ఉన్నారు. ఇటీవల మంత్రి ఉమను పలువురు పాత్రికేయులు కలిసి ఈ ప్రాజెక్టుపై అడిగినప్పుడు తన కన్నా జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ఎక్కువ ఈ ప్రాజెక్టుపై శ్రద్ద చూపారని, ఆయనంత నిజాయితీపరుడైన ఐఎఎస్‌ అధికారులు అరుదుగా ఉంటారని చెప్పారట.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ