WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎయిర్‌టెల్‌' బడాయి...!

దేశంలోనే తమది అత్యుత్తమ మొబైల్‌నెట్‌వర్క్‌ అని తెగ డబ్బా కొంటుకుంటున్న 'ఎయిర్‌టెల్‌' సంస్థ అందుకు తగ్గట్లు వినియోగదారులకు సేవలు అందించడం లేదు. గత ఏడాది నుంచి ఆ సంస్థ సేవల నాణ్యత తగ్గిపోయింది. అందరి కంటే ముందే తాము 4జి ప్రవేశపెట్టామని సంబరాలు చేసుకున్న ఆ సంస్థ దాన్ని విజయవంతం చేయడంలో విఫలమైంది. 4జిపై ఆ సంస్థ చేస్తోన్న ప్రకటనలను 'సుప్రీం' కోర్టు తప్పుపట్టింది. ప్రకటనల్లో ఉన్న నాణ్యత సేవల్లో లేవని ఆ ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. దీంతో 4జిపై అవాస్తవ ప్రచారం చేసిన 'ఎయిర్‌టెల్‌' చివరకు దాన్ని ఉపసంహరించుకుని ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీసింది. తమది దేశంలోనే ఉత్తమ పారదర్శకమైన నెట్‌వర్క్‌ అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. ఓపెన్‌ నెట్‌ వర్క్‌ పేరుతో మరోసారి వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతోంది. ఓపెన్‌ నెట్‌వర్క్‌తో వినియోగదారులకు ఉపయోగం ఏమిటంటే కేవలం ఫిర్యాదు చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. తప్ప వినియోగదారుల సమస్యలను మాత్రం పరిష్కరించ లేదు. ఎక్కడ నెట్‌వర్క్‌ ఉందో...ఎక్కడ లేదో ఈ ఓపెన్‌ నెట్‌వర్క్‌ ద్వారా తెలుసుకోవచ్చట. అసలు సర్వీసే సరిగా లేకపోతే ఎక్కడ నెట్‌వర్క్‌ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఫలానా దగ్గర నెట్‌వర్క్‌ ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి ఫోన్‌ చేసుకోవాలా? బలమైన సిగ్నల్‌ ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చట...? మనం ఉన్న దగ్గర సిగ్నల్‌ లేకపోతే ఎక్కడో ఉంటే ఉపయోగం ఏమిటి? కేవలం వినియోగదారులను బుట్టలో వేసుకోవడానికి తప్ప...వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి ఈ ఓపెన్‌ నెట్‌ వర్క్‌ ఉపయోగపడదు..

(373)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ