WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చెప్పేవి శ్రీరంగనీతులు...!

వాళిద్దరూ పేరు మోసిన పత్రికా ఎడిట‌ర్లు. నిత్యం ప్రజా సమస్యల గురించి...ప్రభుత్వ పథకాల్లో అక్రమాల గురించి, దేశ, అంతర్జాతీయ విషయాలపై పేజీలకు పేజీలు రాసే నిజమైన సంపాదకులు...ఇదంతా నాణేనికి ఒక వైపే...మరో వైపు చూస్తే స్వలాభం కోసం ఎంతటి అక్రమార్కులతోనైనా చేయికలపగలరు... అక్రమంగా వచ్చే సంపాదన కోసం అర్రులు చాచగలరు. ఇప్పుడు వారి భండారం సాక్ష్యాలతో సహా బయటపడింది. నిన్న మొన్నటి దాకా వారు రాసింది...టీవీలో చూపించింది నిజమేనని నమ్మిన వారే ఇప్పుడు ఛీ కొడుతున్నారు. తెలుగు భాషలో ప్రముఖమైన రెండు పత్రికలకు సంపాదకులుగా పనిచేస్తున్న వీరు అక్రమార్కుల కొమ్ము కాసి సుమారు రూ.10కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరెన్నికల పబ్లిషింగ్‌ సంస్థకు వీరు కొమ్ముకాయడం వల్ల వీరికి సుమారు రూ.4కోట్ల నుండి రూ.5కోట్ల రూపాయల విలువైన ఇళ్లను వారు బహుమతిగా ఇచ్చారట. బంజారాహిల్స్‌లో ఉన్న ఆ ఇంటి ఇంటీరియర్‌ డిజైనింగ్‌కే సుమారు 45లక్షల రూపాయలు ఖర్చు అయిందట. పబ్లిషింగ్‌ మాఫియా అక్రమాలు బయటకు రాకుండా కొమ్ము కాసినందుకే వీరికి ఈ ఖరీదైన గిఫ్ట్‌లు దొరికాయని తెలుగు పత్రికా లోకం కోడై కూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాశాఖలోని సర్వశిక్షా అభియాన్‌ కింద ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల పుస్తకాలు కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలులో ఈ ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ పబ్లిషింగ్‌ సంస్థ దీనిలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టేసింది. టెండర్లు లేకుండానే ఈ పుస్తకాల కొనుగోలు ప్రతి సంవత్సరం ఈ ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థకు దక్కుతుంది. ఈ టెంటరు లేని వ్యవహారాలు, ఒక్కరికే ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు కట్టబెడుతున్న వైనం తదితర వార్తలను ఈ పత్రికా సంపాదకులు ప్రచురించరు. అందుకు గాను సదరు ఎడిటర్లకు ఈ సంస్థ ఖరీదైన ఇండ్లను బహుకరించిందని ప్రచారం జరుగుతోంది. అదీ కాక ఈ ఇద్దరు సంపాదకులు రాసే పుస్తకాలు పబ్లిషింగ్‌, ప్రింటింగ్‌ తదితర వ్యవహారాలను కూడా ఈ పబ్లిషింగ్‌ సంస్థే చూస్తుందట. హైదరాబాద్‌లో ఎక్కడ ఏ పుస్తకం విడుదల చేస్తున్నా వీరిద్దరిలో ఒకరు అక్కడ తప్పనిసరిగా ప్రత్యక్షమవుతారు. కాగా ఈ మొత్తం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది.

(1753)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ