WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఇమ్రాన్‌'తో 'సచిన్‌' తనయుడు...!

మాస్టర్‌ బ్లాస్టర్‌ 'సచిన్‌ టెండూల్కర్‌' తన తనయుడు 'అర్జున్‌ టెండూల్కర్‌' కెరీర్‌ విషయంలో పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నాడు. తన తనయుడికి ప్రముఖ క్రికెటర్ల నుంచి సలహాలు ఇప్పిస్తున్నాడట 'సచిన్‌'. అంతే కాకుండా మ్యాచ్‌లను నిశితంగా గమనించమని 'అర్జున్‌'ను 'సచిన్‌' ఎక్కడ మ్యాచ్‌లు జరిగితే అక్కడకు పంపిస్తున్నాడట. తన తనయుడ్ని ఎప్పుడు భారత్‌ జట్టులోకి చేర్చాలనేదానిపై క్లారిటీగా ఉన్న 'సచిన్‌' 'అర్జున్‌'కు ముందే అనువజ్ఞుల సలహాలు,సూచనలను తీసుకొమ్మని చెబుతున్నాడట. ప్రస్తుతం లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఆరంభమైన టెస్ట్‌ మ్యాచ్‌లకు అర్జున్‌ పంపాడు సచిన్‌. అక్కడ ప్రముఖుల అనుభవాలను చూసి నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో ఇలా చేశారు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి అర్జున్‌ తిలకించాడు. అంతేకాదు అప్పుడే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లతో కలిసి షురూ చేస్తున్నాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ అలవాటున్న ఫాస్ట్‌ బౌలర్‌గా కేరీర్‌ను కొనసాగిస్తున్నాడు అర్జున్‌. అన్ని అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి గొప్పగా ఆరగేంట్రం చేయాలనే యోచనలో సచిన్‌ టెండుల్కర్‌ ఉన్నారని టాక్‌.

(288)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ