WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నండూరి'కి అడ్డు తగిలిందెవరు...?

డిజిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జెవిరాముడు పదవీ కాలాన్ని మరో రెండు మూడు మాసాలు పెంచుతారని ప్రచారం జరగడం వెనుక ఆ పోస్టును ఆశిస్తున్న తెలుగేతర ఐపిఎస్‌ అధికారి ప్రమేయం ఉందట. ఇన్‌ఛార్జి డిజిపిగా నండూరి సాంబశివరావు నియామకాన్ని ఏదో విధంగా నిలిపివేయించాలని ఆ అధికారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. వాస్తవంగా జెవి రాముడు పదవీ కాలం ఇంతకు ముందే ముగిసిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం జెవి రాముడును ఆ పదవిలో నియమించారు. ఏడాదిన్నర కాలం కిందటే రాముడుకు 60 ఏళ్లు నిండాయి. ఆయన అప్పుడే రిటైర్‌ కావాల్సింది. కానీ కేంద్రం ఇచ్చిన సూచనల ప్రకారం ఆయనకు మరో ఆరు నెలలు కలసివచ్చాయి. దీంతో ఆయన సర్వీసు రేపటితో పూర్తి అవుతుంది.కాగా ఆయన సర్వీసును మరో రెండు నెలలు పొడిగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన సర్వీసు పొడిగింపుకు ఏ నిబంధనలు అంగీకరించవు. ఈ విషయం తెలియని ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు అదిగో పెంపు...ఇదిగో పెంపు అంటూ హడావుడి చేశారు. ఆ వార్తలు విన్న సీనియర్‌ పాత్రికేయులు నవ్వుకుని సంబంధిత ఛానల్స్‌ సీనియర్లకు ఫోన్‌లు చేసి నిబంధనలను వివరించారట. దీంతో ఆ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది. కాగా ఏదో విధంగా 'నండూరి' నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగేతర అధికారికి ఎదురుదెబ్బ తగలడంతో ఆయన ఇప్పుడు మౌనం వహించారట. 'నండూరి'కి ఆ తెలుగేతర అధికారికి మధ్య తీవ్రమైన విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయట. ఒక వైపు 'కాపు' కులాన్ని చంద్రబాబుపైకి రెచ్చగొట్టాలని కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రయత్నిస్తున్న సమయంలో 'కాపు' కులస్తుడైన 'నండూరి' నియామకాన్ని 'చంద్రబాబు' ఎందుకు ఆపుతారని ఆఫ్‌ ది రికార్డుగా సీనియర్‌ ఐపిఎస్‌లు అంటున్నారు. 'నండూరి సాంబశివరావు'ను తాత్కాలికంగా నియమించడం వెనుక ఏదైనా మర్మం ఉందా? అన్న ప్రశ్నకు గతంలో 'రాముడు'ను నియమించిన విధంగానే 'నండూరి'ని కూడా నియమిస్తారని ఆయన సన్నిహిత పోలీసు అధికారులు చెబుతున్నారు. తన నియామకం వెనుక కుట్ర జరుతుందని 'నండూరి'కి తెలుసు. కానీ 'కులం' కార్డు కలసి వస్తుందన్న సంగతి ఆయన ప్రత్యర్థులు తెలుసుకోలేకపోయారు. నండూరి ఇన్‌ఛార్జి డిజిపిగా నియమితులు కావడంలో తెరవెనుక ఉండి ఆయన నియామకాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో? జెవి రాముడు కూడా సర్వీసు పొడిగింపు వస్తుందని ఆశ పడినప్పటికీ అటువంటి కోరిక తనకు లేదని ఇప్పటికే సంతృప్తిగా బాధ్యతలు పూర్తి చేశానని నా కన్నా అదృష్టవంతులు ఎంతమంది ఉంటారని తనను కలసిన వారితో నవ్వుతూ అన్నారట. ఇందులో నిజం లేకపోలేదు...ఏడాదిన్నర కిందటే రాముడుకి 60ఏళ్లు నిండాయి. డిజిపిగా ఎవరు నియమితులైనా కనీసం వారి సర్వీసు రెండేళ్లు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఆ ఆలోచనను సూచనల రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవచ్చు...చేయకపోవచ్చు. రాముడు విషయంలో చంద్రబాబు అదే విధంగా పాటించారు.

(691)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ