WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తొలి డబుల్‌ సెంచరీ బాదిన 'కోహ్లీ'

టెస్టులో భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి డబుల్‌ సెంచరీని కొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ 281 బంతులను ఎదుర్కున్న కోహ్లీ 200ని పూర్తీ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 'కోహ్లీ'కి ఇదే తొలి డబుల్‌ సెంచరీ. వన్డేల్లో కోహ్లీ టాప్‌ స్కోర్‌ 183. భయంకరమైన ఫామ్‌లో ఉన్న 'కోహ్లీ'ని అడ్డుకోవడం వెస్టిండీస్‌ బౌలర్ల వల్ల కాలేదు. వెస్టిండీస్‌ బౌలర్లను కోహ్లీ సాదాసీదాగా ఆడేశాడు. వారి నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురవలేదు. కేవలం 281 బంతులు ఎదుర్కొని డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పటికే 24బౌండరీలతో 71.02 స్ట్రైక్‌రేట్‌తో కదం తొక్కడం విశేషం. సునీల్‌ గవాస్కర్‌ తరువాత వెస్టండీస్‌ గడ్డపై డబుల్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌ కూడా కోహ్లీనే కావడం విశేషం. సీనియర్‌ క్రికెటర్ల రిటైర్‌మెంట్‌ తరువాత తొలిసారి విదేశీపర్యటనకు వెళ్లిన 'కోహ్లీ' తనదైన స్టైల్‌లో చెలరేగిపోయాడు. ప్రస్తుత యువతరం క్రికెటర్లలో విదేశీ టూర్‌లో తొలి సెంచరీ సాధించిన వ్యక్తి కూడా కోహ్లీనే కావడం గమనార్హం.

(468)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ