WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రిచర్డ్స్‌' మాటలు బంగారం...!

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెచ్చిపోవడానికి కారణం 'వివ్‌ రిచర్డ్స్‌' అట. ఈ విషయాన్ని స్వయంగా 'కోహ్లీ'నే తెలిపారు. టెస్టుకు ముందు 'సర్‌ రిచర్డ్స్‌'ను కలవడం మరిచిపోలేని జ్ఞాపకం. ఆయన మాటలు బంగారం...అందు వల్లే రెచ్చిపోయి ఆడగలిగాను అని కోహ్లీ ట్టిట్టర్‌లో తెలిపారు. రిచర్డ్స్‌ చేసిన సూచనలే తొలి టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడానికి కారణమని అందుకే డబుల్‌ సెంచరీ సాధించిన తరువాత ఆయనకు హెల్మెట్‌ తీసి అభివాదం చేశానని 'కోహ్లీ' చెప్పారు. కాగా విరాట్‌ సెంచరీ కొట్టినప్పుడల్లా గాలిల్లోకి ముద్దులు విసురుతుంటారు..అయితే ఈ సారి కరేబియన్‌ గడ్డను ముద్దాడి ఆయన ప్రత్యేకత ను చాటుకున్నారు. తాను ఈ సారి ముద్దు ఇచ్చింది ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూస్తున్న 'రిచర్ట్స్‌'కేనని ఆయన తెలిపారు. 'రిచర్డ్స్‌' ఇచ్చిన సలహాలు,సూచనలతోనే తాను చెలరేగిపోయాయనని 'కోహ్లీ' చెప్పుకొచ్చారు. మొత్తం మీద గత వెస్టండీస్‌ పర్యటనలో మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోయి తొలి టెస్టులోనే డబుల్‌ బాది తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి 'కోహ్లీ' రుజువు చేసుకున్నారు.

(365)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ