లేటెస్ట్

ఆంధ్రాలో ‘బాబు’, తెలంగాణ‌లో ‘రేవంత్’లదే గెలుపు...!

లోక‌ల్ యాప్ స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు


తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార‌పార్టీలు ఘోర ఓట‌మికి గుర‌వుతాయ‌ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఆంధ్రాలో అధికారంలో ఉన్న ‘జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి’కి, తెలంగాణ‌లో  అధికారంలో ఉన్న ‘కెసిఆర్’ కు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని  లోక‌ల్ యాప్ సంస్థ నిర్వ‌హించిన‌ స‌ర్వేలో తేలింది. ఈ రెండు ప్ర‌భుత్వాలపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ని, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వీరిని ఓట‌ర్లు ఘోరంగా ఓడిస్తార‌ని ఆ సంస్థ పేర్కొంది. ఈ సంస్థే కాకుండా ఇటీవ‌ల ‘మూడ్ ఆఫ్ ది నేష‌న్’ పేరిట ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ‘ఇండియాటుడే’ నిర్వ‌హించ‌న స‌ర్వేలోనూ ఇదే తేలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’, తెలంగాణ ముఖ్య‌మంత్రి ‘కెసిఆర్’ లు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఘ‌న‌నీయంగా కోల్పోయార‌ని, దేశంలో ఉత్త‌మ ముఖ్య‌మంత్రుల జాబితాలో వీరిద్ద‌రి పేర్లు అస‌లు లిస్టులోనే లేవ‌ని, దాంతో వీరు ఎంత‌గా ప్ర‌జ‌ల విశ్వాసం కోల్పోయారో అర్ధం అవుతోంది. వివిధ సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న స‌ర్వేల్లో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలిపోతోంది.

ఆంధ్రాలో ‘చంద్ర‌బాబు’

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి 44శాతం ఓట్లు వ‌స్తాయ‌ని లోక‌ల్ యాప్ త‌న స‌ర్వేలో స్ప‌ష్టం చేసింది. అధికార వైకాపాకు 43శాతం, బిజెపి-జ‌న‌సేన కూట‌మికి 13.05శాతం ఓట్లు వ‌స్తాయ‌ని ఆ స‌ర్వే పేర్కొంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైకాపా దాదాపు 51శాతం ఓట్లు సాధించి 151 ఎమ్మెల్యే స్ధానాల‌ను గెలుచుకుంది. అయితే రెండేళ్ల వైకాపా పాల‌న త‌రువాత ఇప్పుడు ఆ పార్టీ 7 శాతం ఓట్లును కోల్పోనుంద‌ని స్ప‌ష్టం అయింది. గ‌త ఎన్నిక‌ల్లో 37 శాతం సాధించిన టిడిపి ఇప్పుడు అనూహ్యంగా ఏడు శాతం ఓట్ల‌ను పెంచుకుని అధికార‌పార్టీపై పైచేయి సాధించింది. గ‌త రెండేళ్ల వైకాపా పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తే దీనికి కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందుకుంటున్న వారు కూడా వైకాపాకు వ్య‌తిరేకం అవుతున్నార‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు అల‌వికాని హామీలు ఇచ్చి వాటిని అమ‌లు చేయ‌లేక చేతులెత్తేయ‌డంతో ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పై భ్ర‌మ‌లు తొలిగిపోతున్నాయి.

మూడో స్ధానంలోకి ‘టిఆర్ఎస్’..!

తాజాగా తెలంగాణాలో నిర్వ‌హించ‌న స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలంగాణ ఏర్పాటు అయిన త‌రువాత రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చిన టిఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు చావుదెబ్బ‌కొట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మూడోస్ధానానికి వెళుతుంద‌ని లోక‌ల్ యాప్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో’ రేవంత్ రెడ్డి’ ఆధ్వ‌ర్యంలోని ‘కాంగ్రెస్’ ఇక్క‌డ గెల‌వ‌బోతోంద‌ని స‌ర్వే తెలిపింది. కాగా ‘బిజెపి’ ఇక్క‌డ రెండోస్థానంలో నిలుస్తుంద‌ని, అధికార ‘టిఆర్ఎస్’ మూడోస్ధానానికి వెళుతుంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌ల్లో త‌న ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించే ముఖ్య‌మంత్రి ‘కెసిఆర్’ ద‌ళిత కుటుంబాల‌కు ప‌దిల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తానంటూ వ‌స్తున్నార‌ని, మ‌రెన్నో ప్ర‌జాక‌ర్ష‌ణ ప‌థ‌కాల‌కు ఆయ‌న తెర‌తీస్తున్నారంటున్నారు. ప్ర‌స్తుత స‌ర్వే ప్ర‌కారం రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు 40శాతం, బిజెపికి 34 శాతం, టిఆర్ఎస్ కు 26శాతం ఓట్లు వ‌స్తాయ‌ని స‌ర్వే సంస్ధ పేర్కొంది. మొత్తం మీద రాబోయే ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార‌పార్టీల ప‌త‌నం త‌ప్ప‌ద‌ని స‌ర్వే సంస్థ ఘంటాపథంగా చెబుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ