WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈ దారుణం చూసే ధైర్యం మీకు ఉందా...?!(వీడియో)

చైనాలో జరిగిన ఈ దారుణం చూసిన వారిని వణికిస్తోంది.చుట్టూ వందలాది మంది జనం..కార్లు..ఉన్న సమయంలో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ పులి మహిళను ఎత్తుకెళ్లి చంపేసి తినేసింది. ఈ దారుణం చైనా రాజధాని బీజింగ్‌ యాంక్వింగ్‌ జిల్లా గ్రేట్‌ వాల్స్‌కు సమీపంలోని సఫారీ పార్క్‌ దగ్గర జరిగింది. ఓ కారు మహిళ కుటుంబంతో కలసి వెళుతోంది. డ్రైవింగ్‌ సీటు మారేందుకు అందులోని మహిళ ఒక వైపు నుంచి దిగి మరో వైపుకు వచ్చి డోర్‌ తీయబోయింది. అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో కానీ..ఓ చిరుత ఆమాంతం ఆమెపై దాడి చేసి పక్కకు ఎత్తుకెళ్లి చంపి తినేసింది. కారులో ఉన్న మహిళ కుటుంబ సభ్యులు ఆమెను రక్షించడానికి వెళ్లగా వారిపై కూడా 'చిరుత' దాడి చేసింది. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఈ సంఘటన నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన భయబ్రాంతులకు గురి చేస్తోంది.



(7766)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ