WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం...!

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీతో తొలి టెస్టులో విజయం ఖాయమైనా మూడు రోజుల్లోనే విజయం దక్కుతుందని భారత్‌ అభిమానులు ఎవరూ అనుకోలేదు. కానీ స్పిన్నర్‌ అశ్విన్‌ దెబ్బకు వెస్టిండీస్‌ మూడో రోజే చేతులు ఎత్తేసింది. 63 సంవత్సరాల్లో ఎప్పుడూ సాధ్యం కాని ఇన్సింగ్స్‌ విజయాన్ని భారత్‌ తొలిసారి రుచిచూసింది. నాలుగు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను భారత్‌ ఇన్సింగ్స్‌ 92 పరుగల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. 323 పరుగులు వెనకబడి ఫాలో ఆన్‌ ఆడిన ఆ జట్టు 231 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ అశ్విన్‌ ఏడు వికెట్లు తీయడంతో వెస్టిండీస్‌ పరాజయం లాంచనం అయింది. మొదటి ఇన్సింగ్‌లో సెంచరీతో చెలరేగిన అశ్విన్‌ రెండో ఇన్సింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కూడా అతనికే వరించింది. ఆంటిగ్వా: తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్‌ చేసి, ఆ జట్టును ఫాలోఆన్‌లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. బంతితోనూ విజృంభించాడు. అతను 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్‌.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. శామ్యూల్స్‌ (50), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (51 నాటౌట్‌), బిషూ (45) మాత్రమే కాస్త పోరాడారు. అంతకుముందు మూడో రోజు షమి (4/66), ఉమేశ్‌ యాదవ్‌ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 243 పరుగులు చేసి ఆలౌటైంది. లోయరార్డర్లో డౌరిచ్‌ (57), హోల్డర్‌ (36) పోరాడటంతో విండీస్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.

(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ