WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హైదరాబాద్‌కు 'నారాయణ' రాం..రాం...!

మున్సిపల్‌శాఖ 'వెలగపూడి' సచివాలయానికి తరలిస్తామని పదే పదే ప్రకటించిన నారాయణ ఇంత వరకు అది అమలుకు నోచుకోకపోవడంతో హైదరాబాద్‌కు రావడం లేదు. నిన్నటి వరకు సచివాలయంలో ఎల్‌ బ్లాక్‌ రెండవ ప్లోర్‌లో ఉన్న మంత్రి నారాయణ కార్యాలయాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్‌ కమీషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌కు కేటాయించారు. ఈ నెలాఖరుకు మున్సిపల్‌శాఖను పూర్తిగా తరలిస్తానని మంత్రి నారాయణ చెబుతున్నారని, ముఖ్య కార్యదర్శి ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగులు చెబుతున్నారు. వెలగపూడి వెళ్లడం ఖాయం..ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు..ఇప్పటికీ మూడుసార్లు తేదీలు నిర్ణయించి వాయిదా వేశారు. హైదరాబాద్‌ వస్తే తన పరువు పోతుందని మంత్రి నారాయణ భావించి ఉంటారని అందుకే ఆయన ఇక రానని ఖరాఖండితంగా చెప్పారట. ఫైళ్లు కూడా విజయవాడకు తీసుకెళుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ కొన్ని వందల ఫైళ్లు పరిష్కారానికి నోచుకోక కింది స్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు బీరువాలలో భద్రపరిచారు. ఈ నెలాఖరుకు 'వెలగపూడి' నుండే పూర్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని ఉద్యోగులు భావిస్తున్నప్పటికీ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి విదేశీపర్యటన నుంచి రేపో మాపో వచ్చాక కానీ తేదీ నిర్ణయం జరగదని పలువురు చెబుతున్నారు. 'వెలగపూడి' ముందుగా వెళ్లేది తన శాఖేనని గర్వంగా చెప్పుకున్న నారాయణ ఇంత వరకు ఆయన కార్యాలయం ప్రారంభానికి కూడా నోచుకోకపోవడంతో ఎవరికి ఏమి చెప్పాలో తెలియక హైదరాబాద్‌ రాకుండా మొహం చాటేస్తున్నారని అంటున్నారు.

(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ