మహిళా రైతులను అవమానించడం బాధాకరం:పవన్కళ్యాణ్

మహిళా రైతులను పోలీసులు, ప్రభుత్వం అవమానించడం, అదీ మహిళా దినోత్సవవేళ మరో ఘోరమని, వారితో వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని జనసేన అధ్యక్షుడు 'పవన్కళ్యాణ్' విమర్శించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న మహిళలు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకుని లాఠీలు ఝళిపించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత అవమానకర రీతిలో ఉన్నాయని, దైవ దర్శనం కోసం వెళుతున్న మహిళలను అడ్డుకోవాలని ఏ చట్టాలు చెబుతున్నాయని 'పవన్' ప్రశ్నించారు. అమరావతి మహిళలు అమ్మవారిని దర్శించుకునే హక్కు లేదా..ః? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు దాదాపు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన పాలకులు ప్రతి సందర్భంలోనూ అవమానపరుస్తున్నారని, శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం సమంజసం కాదని పవన్ పేర్కొన్నారు.