లేటెస్ట్

దంచికొట్టిన 'కిషన్‌,కోహ్లీ'...!

రెండో టి20లో భారత్‌ గెలుపు

మొదటి టి20లో ఓడిపోయిన భారత్‌ రెండో టి20లో తన ప్రతాపాన్ని చూపించింది. వికెట్‌ కీపర్‌ 'ఇషాంత్‌ కిషన్‌, కెప్టెన్‌ కోహ్లీ'లు దంచి కొట్టడంతో రెండో టి20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మొదటి ఓవర్‌లోనే రాహుల్‌ వికెట్‌ కోల్పోయినా భారత్‌ను 'ఇషాంత్‌', కోహ్లీలు ఆదుకున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఇషాంత్‌ కిషన్‌ భారీ షాట్‌లతో ఇంగ్లాండ్‌ బౌలర్లను దంచి కొట్టాడు. 32 బంతుల్లో 5 ఫోర్లతో నాలుగు సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. కెప్టెన్‌ కోహ్లీతో కలసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించిన 'కిషన్‌' రషీద్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న 'కిషన్‌' మొదటి బంతికే ఫోర్‌తో ఇన్సింగ్స్‌ ఆరంభించి తరువాత జోరు పెంచాడు. 'కిషన్‌' అవుట్‌ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన 'పంత్‌' 13 బాల్స్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 రన్స్‌ చేసి భారత్‌ టార్గెట్‌ను సాధించడానికి తోడ్పడ్డాడు. మరో వైపు కెప్టెన్‌ కోహ్లీ  ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 73 పరుగలు చేశాడు. చాలా రోజుల తరువాత ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ జూనియర్లతో కలసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

(221)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ