లేటెస్ట్

జ‌గ‌న్‌కు ఘోర‌ప‌రాభ‌వం త‌ప్ప‌దు: ప్ర‌శాంత్‌కిశోర్‌

జ‌గ‌న్ మాజీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ పోలింగ్‌కు ముందు ఆయ‌న‌కు మ‌రోసారి షాక్ ఇచ్చారు. మ‌రి కొన్ని గంట‌ల్లో పోలింగ్ జ‌రుగుతుండ‌గా ఆయ‌న ఆర్‌టివికి  ఇంట‌ర్య్వూఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కొన్ని సంచ‌ల‌న విష‌యాలను వెల్ల‌డించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార వైకాపా ఘోరంగా ఓడిపోతుంద‌ని, కొంద‌రు ప్ర‌స్తుత మంత్రులుఎన్నిక‌ల త‌రువాత టిడిపి పార్టీలోచేర‌తార‌ని, ఇప్ప‌టికే వారు టిడిపి అథినేత చంద్ర‌బాబునాయుడుతో ఒప్పందాలు చేసుకున్నార‌ని తెలియ‌చేశారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌ల త‌రువాత టిడిపిలోచేర‌తార‌ని, ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు మాజీ మంత్రులు కూడా టిడిపిలో చేర‌తార‌ని ఆయన చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఘోరంగా ఓడిపోతార‌ని, ఆయ‌న వ్య‌వ‌హార‌శైలే ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మ‌ని ప్ర‌శాంత్‌కిశోర్ తెలిపారు. 2019లో ఆయ‌న త‌న స‌హ‌కారంతో బ్ర‌హ్మాండ‌మైన గెలుపును పొందార‌ని, కానీ ఈసారి మాత్రం ఆయ‌న ఘోరంగా ఓడిపోతార‌ని తాను గ‌త కొన్నాళ్లుగా చెబుతున్నాన‌ని, ఇప్పుడూ అదే చెబుతున్నాన‌ని ప్ర‌శాంత్ కిశోర్ ఆ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఏడాదిన్న‌ర క్రితం జ‌గ‌న్ త‌న‌ను ఢిల్లీలో క‌లిశార‌ని అప్పుడే ఆయ‌న ఓడిపోతార‌నే విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పాన‌ని, కానీ ఆయ‌న దాన్ని అంగీక‌రించ‌లేద‌ని, త‌నకు ఎవ‌రితో పోటీ లేద‌ని, త‌న‌కు 155 సీట్లు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్ప‌గా, అలా అయితే సంతోష‌మేన‌ని తాను అన్నాన‌ని ప్ర‌శాంత్ వెల్ల‌డించారు. 


జ‌గ‌న్‌తో విభేదాలు లేవు..కానీ...ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త లేదు

జ‌గ‌న్‌తో త‌న‌కు విబేధాలు లేవ‌ని, అయితే ఆయ‌న‌కు క‌నీసం కృత‌జ్ఞ‌త అనేది లేద‌ని ప్ర‌శాంత్‌కిశోర్ వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాన‌ని, కానీ త‌రువాత ఆయ‌న క‌నీసం కృత‌జ్ఞ‌త చూపించ‌లేద‌ని, ఇటువంటి వ్య‌క్తుల‌ను అరుదుగా చూస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల త‌రువాత తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాలేద‌ని, కానీ ఆంధ్ర‌లో ఏమి జ‌రుగుతుందో చూస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. చారిత్రాత్మ‌క విజ‌యం త‌రువాత జ‌గ‌న్ త‌నను తాను రాజుగా భావించుకుంటున్నాడ‌ని, తాను అంద‌రికి ఇచ్చేవాడుగా, ప్ర‌జ‌లంతా పుచ్చుకునేవారిలా ఆయ‌న భావిస్తున్నార‌ని, ఇది ఆయ‌న అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌శాంత్‌కిశోర్ వ్యాఖ్యానించారు. ఆయ‌న వ‌రుసుగా త‌ప్పులు చేసుకుంటూ పోయార‌ని, ఒక‌దాని త‌రువాత ఒక‌టి చేసుకుంటూ ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యార‌ని ఆయ‌న అన్నారు. ఎమ్మెల్యేల‌కు క‌నీసం క‌లిసే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని, ఈ ఐదేళ్ల‌ల్లో క‌నీసం ఒక్క‌సారి కూడా కొంద‌రు ఎమ్మెల్యేలు సిఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌లేక‌పోయార‌ని, ఎమ్మెల్యేల‌కే అందుబాటులోలేని వ్య‌క్తి సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎలా అందుబాటులో ఉంటాడ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌ను తాను దైవాంశ‌సంభూతిడిగా, రారాజుగా భావించే వ్య‌క్తి జ‌గ‌న్ అని, ఆయ‌న‌లో ప్ర‌జాస్వామ్య ల‌క్ష‌ణాలు ఇసుమంత కూడా లేవ‌ని, ఇటువంటి వ్య‌క్తికి జూన్‌4వ తేదీన షాక్ తింటార‌ని ప్ర‌శాంత్‌కిశోర్ అన్నారు. ప్ర‌జ‌ల‌ను బిచ్చ‌గాళ్ల‌గా చూసే వ్య‌క్తి వారి చేతిలోనే గుణ‌పాఠం నేర్చుకుంటార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా పోలింగ్‌కు కొన్ని గంట‌ల ముందు ప్ర‌శాంత్ కిశోర్‌చేసిన వ్యాఖ్య‌లు వైకాపా నేత‌ల‌కు షాక్ ఇచ్చాయ‌నే ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా వైకాపా ఘోరంగా ఓడిపోతోంద‌నే భావ‌న మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ