లేటెస్ట్

'తూర్పు'లో దెబ్బేసిన 'జనసేన'..!

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడంపై పార్టీలో అంతర్మధనం జరుగుతోంది. విజయవాడ నగరంలో మొత్తం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 'విజయవాడ తూర్పు'లో టిడిపి బలంగా ఉంది. గత ఎన్నికల్లో 'విజయవాడ వెస్ట్‌', విజయవాడ సెంట్రల్‌ల్లో టిడిపి ఓడిపోయింది. కానీ 'తూర్పు'లో మాత్రం టిడిపి 18వేల ఆధిక్యంతో గెలుపొందింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో 'విజయవాడ' తూర్పులో ఉన్న 21 డివిజన్లల్లో మెజార్టీ స్థానాల్లో 'టిడిపి' విజయం సాధిస్తుందని భావించారు. కానీ ఇక్కడ టిడిపి కేవలం ఏడు డివిజన్లల్లోనే గెలుపొందింది. అధికార వైకాపా 14 డివిజిన్లల్లో గెలుపొందింది. ఎందువల్ల ఇక్కడ టిడిపి ఓడిపోయిందనే దాని పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ వెస్ట్‌ల్లో స్థానిక నాయకత్వం పనిచేయకపోవడం వల్ల పార్టీ ఓడిపోయిందని, ఎన్నికలకు ముందు అసమ్మతివాదులు లేపిన చిచ్చుతో పార్టీ అక్కడ చతికిలపడిందని భావించినా..మంచి పట్టు ఉన్న 'తూర్పు'లో టిడిపికి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఆ పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు రుచించడం లేదు. 

కాగా ఇక్కడ 'జనసేన' తమ పార్టీని బాగా దెబ్బకొట్టిందని టిడిపి నాయకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని, వీరంతా 'జనసేన'కు ఓటు వేయడంతో టిడిపికి దెబ్బతగిలిందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 'గద్దె రామ్మోహన్‌'కు కులాలకు అతీతంగా ఓట్లు వేశారని, ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదని, 'జనసేన' అభ్యర్థులు మంచి పోటీ ఇచ్చి ఓట్లు చీల్చారంటున్నారు. దీంతో టిడిపికి అనుకున్న స్థానాలు రాలేకపోయాయంటున్నారు. మరోవైపు 'విజయవాడ తూర్పు' నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న 'దేవినేని అవినాష్‌' తనవంతు ప్రయత్నాలు చేశారని, ఏడాది నుంచే ఆయన నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని, పార్టీ అభ్యర్థులను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయించారని,ఆయన ప్రయత్నాలు కొంత వరకు సఫలమయ్యాయని చెబుతున్నారు.

'దక్షిణాది 'కమ్మ'ల పట్టుదల...!

కాగా ఇక్కడో ఆసక్తికరమైన విషయం ప్రచారం జరుగుతోంది. స్వతాగా కృష్ణా జిల్లాలో పుట్టి 'విజయవాడ'లో సెటిల్‌ అయిన 'కమ్మ' సామాజికవర్గ ఓటర్లు కొంత మంది వైకాపా వైపు మొగ్గుచూపారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక్కడ ఏడు డివిజన్లల్లో టిడిపి గెలిచిందంటే  అది 'దక్షిణాది నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన 'కమ్మ' వర్గ ఓటర్ల పట్టుదల వల్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న 'కమ్మ' సామాజికవర్గం ఈ ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలనే పట్టుదలతో వ్యవహరించిందని, వారు ఎక్కడా అధికారపార్టీకి లొంగకుండా పార్టీ గెలుపు కోసం సైలెంట్‌గా పనిచేశారు. 'పడమట'లో ఎక్కువగా ఈ ప్రభావం కనిపించింది. మొత్తం మీద దక్షిణాది నుంచి వచ్చిన 'కమ్మ' సామాజికవర్గం  చూపించినంత పట్టుదలను  'కృష్ణా'లో ఉన్న 'కమ్మ'లు చూపించలేదనేది నిష్టుర సత్యం. 

(390)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ