లేటెస్ట్

'చంద్రబాబు'కు సీఐడీ నోటీసులు...!

టిడిపి జాతీయ అధ్యక్షుడు 'నారా చంద్రబాబునాయుడు'కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలోనే 'చంద్రబాబు'కు నోటీసులు జారీ చేశారు. రెండు బృందాలుగా వెళ్లిన సీఐడీ అధికారులు 'చంద్రబాబు' ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఆయన విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో పది మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలోనూ, భూముల సేకరణలోనూ అవినీతి జరిగిందని 'జగన్‌' ప్రభుత్వం పేర్కొంటూ వస్తోంది. రాజధాని భూముల్లో ఇన్‌సైడ్‌ ట్రేడ్‌ జరిగిందని ప్రభుత్వం ఇంతకు ముందు కేసులు నమోదు చేసింది. ఈ కేసును ప్రతివాదులు హైకోర్టులో సవాల్‌ చేయగా సీఐడీ విచారణను నిలుపుదల చేసింది. మొత్తం మీద మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరసటి రోజే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడం చర్చనీయాంశం అయింది. కాగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(368)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ