లేటెస్ట్

స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టరా...!?

చాలా మంది సెక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నా దంపతులకు పిల్లలు పుట్టరు. దీని కోసం డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకుంటే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్లల్లో స్పెర్మ్‌కౌంట్‌ తక్కువగా ఉండడం కూడా కారణమే. కేవలం మహిళల వల్లే పిల్లలు పుట్టడం లేదనే భావనకు రాకుండా దంపతులు ఇద్దరూ పరీక్షలు చేయించుకుంటే ఎవరిలో లోపం ఉందో తెలుస్తుంది. దాని ద్వారా సంతానం పొందేందుకు అవకాశం ఉంటుంది. మహిళల్లో అంతా బాగానే ఉండి, మగవాళ్లలో సమస్యలు ఉండే అవకాశం ఉంది. దీనిలో ప్రధానంగా స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండడం. దీనికి చికిత్స తీసుకుంటే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఒకవేళ అలా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఐ.వి.ఎఫ్‌ ద్వారా సంతానాన్ని పొందవచ్చు. 

స్పెర్మ్‌కౌంట్‌ తగ్గడానికి కారణాలు

1.అధిక బరువు ఉండడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతుంది. అధిక బరువు కారణంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌స్థాయి తగ్గి, ఈస్టోడైల్‌ హార్మోన్‌స్థాయి పెరిగితే స్పెర్మ్‌కౌంట్‌ తగ్గుతుంది.

2. అధిక బరువు కారణంగా తొడల మధ్య ఒరిపిడి వేడి పుట్టి, ఆ ప్రభావంతో వృషణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

అధిక బరవు కారణంగా చోటు చేసుకున్న హార్మోన్‌ అవకతవకలను మందులతో సరిచేయవచ్చు. ఇదే సమయంలో బరువు కూడా తగ్గడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అధిక బరువు తగ్గినా  స్పెర్మ్‌కౌంట్‌ పెరగకపోతే వైద్యుల సూచన మేరకు ఐ.వి.ఎఫ్‌ ద్వారా సంతానం పొందేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.

-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

(257)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ