WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా'ను దోచుకుంటున్న దొంగలు...!

గోడను దోచుకోవడమేమిటనేగా మీ ప్రశ్న...? గోడను ఎలా దోస్తారనేగా మీ ప్రశ్న..? ఆగండి...ఆగండి...మీరు విన్నది నిజమే...మీ ప్రశ్నకు మేము సమాధానాలు ఇస్తాం..అవును గోడనే దోచుకుంటున్నారు.. గ్రేట్‌వాల్‌ను దోపిడీ దొంగలు నిలువునా కూలుస్తున్నారు.. అదెక్కడంటే చైనాలో..ప్రపంచ వింతల్లో ఒకటైనా 'గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా' గోడలో ఉన్న ఇటుకలు ఇప్పుడు మాయం అవుతున్నాయి. వీటిని దొంగలిస్తున్న దోపిడీ దొంగలు ఆ ఇటుకల ప్రధాన్యతను తెలుపుతూ పర్యాటకులకు అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో గ్రేట్‌వాల్‌ను కూలుస్తూ పోతున్నారు...కనిపించిన చోటల్లా గోడకు ఉన్న ఇటులను పీకేసి అమ్మేస్తున్నారు. కొందరు ఇలా చేస్తుంటే మరి కొందరు ఆ ఇటుకలతో ఇళ్ల నిర్మాణాలను, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. మంగోలియన్‌ దాడులను అరికట్టడానికి చైనాకు చెందిన మింగ్‌ రాజవంశం (1368-1644) కాలంలో దాదాపు 21వేల కిలోమీటర్ల పొడవునా ఉత్తర చైనా వ్యాప్తంగా ఈ గోడను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోన్న ఈ గోడ ఇప్పుడు దొంగల పాలవుతోంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఈ గోడను రక్షించుకోవడానికి 'చైనా' ప్రభుత్వం నడుం బిగించింది.

(785)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ