WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్లైట్‌ క్రాష్‌ అవుతుంటే..వాళ్లేం చేశారో తెలుసా...!(వీడియో)

ఒక పక్క విమానం కాలిపోతోంది..త్వరగా క్రిందికి దూకి ప్రాణాలు కాపాడుకోండని విమాన సిబ్బంది ఒకటే అరుస్తుంటే విమానంలో ఉన్న ప్రయాణీకులు ఏం చేస్తున్నారో తెలుసా...? ల్యాప్‌టాప్‌ కోసం..ఇతర వస్తువుల కోసం వెతుకుతూ ప్రాణాలను పణంగా పెట్టారు..విమానం మరో 90 సెకండ్లలో పూర్తిగా కాలిపోతోందని హెచ్చరికలు చేస్తుంటే ల్యాప్‌టాప్‌ కోసం కొంత మంది ప్రయాణీకులు అరుస్తూ వెతుకుంటున్నారు. ప్రాణాలకన్నా వారికి ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులే ఎక్కువయ్యాయి.. బుధవారం నాడు తిరువనంతపురం నుంచి దుబాయ్‌కి వచ్చిన ఎమిరేట్స్‌ విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయినప్పుడు ప్రయాణీకులు చేసిన నిర్వాహకం ఇది. విమానం క్రాష్‌ అవుతుంటే 90సెకండ్లలో ప్రయాణీకులనందరినీ ఖాళీ చేయించడానికి విమాన సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంటే వారికి సహకరించకుండా వస్తువుల కోసం వెతుక్కోవడం సంచలనం సృష్టిస్తోంది. ఒక్క పది సెకన్లు ఇంకా విమానంలోనే ప్రయాణీకులు ఉంటే మొత్తం కాలి బూడిద అయ్యేవారని సిబ్బంది చెబుతున్నారు. కాగా ఎమిరేట్స్‌ విమానం క్రాష్‌ అయినప్పుడు లోపల ప్రయాణీకులు ఏం చేస్తున్నారో మీరూ వీడియోలో చూడండి.



(823)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ