WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓ మంత్రి...ఆరుగురు ఎమ్మెల్యేలు చెప్పినా..నో...!

ప్రకాశం జిల్లా డిఆర్‌ఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి రిటైర్‌ కావడంతో ఆపోస్టులో ఫలానా అధికారిని నియమించాలని ఆరుగురు ఎమ్మెల్యేలు...ఆ జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి సిఫార్సు చేశారు. సిఫార్సు చేయించుకున్న అధికారి తనకు ఆ పోస్టు దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారట. కానీ..వీరి సిఫార్సును డిప్యూటీ సిఎం తోసిపుచ్చి...తనను మెప్పించిన అధికారిని ఆపోస్టులో నియమించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు...మంత్రి శిద్దారాఘరావులు అవాక్కయారు. ఎమ్మెల్యేల సిఫార్సులతోనే అధికారులను నియమిస్తున్నానని ఘనంగా చెప్పుకున్న మంత్రి కె.ఇ. ఇప్పుడు వారి సిఫార్సును ఎందుకు తిరస్కరించారు...? వారేమైనా అవినీతి అధికారిని సిఫార్సు చేశారా? లేదా వారు లంచాలు తీసుకుని సిఫార్సు చేశారని మంత్రిగారు భావించారా? ఎందుకు వారి సిఫార్సును డిప్యూటీ సిఎం తిరస్కరించారు...? దీనిలోని మర్మం ఏమిటి?... ఆ అధికారి కె.ఇ.ని ఏ విధంగా మెప్పించారు...? ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది...? ఈ విషయాన్ని త్వరలో బయటపెట్టి...ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని మంత్రి శిద్దారాఘవరావు, ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే డిఆర్‌ఒగా నియమించిన అధికారి అంతకు ముందు దుర్గగుడి ఇఒగా పనిచేసి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు..ఇతరత్రా విషయాల్లో తలదూర్చి వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు.. ఈ అధికారి పనితీరుపై ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి ఆయనను అక్కడి నుండి బదిలీ చేశారు. దుర్గగుడి నుండి బదిలీ చేసినా...ప్రకాశం డిఆర్‌ఒగా ఆయనను నియమించారుగా అని..రాజకీయ నాయకులు వ్యగ్యంగా విమర్శిస్తున్నారు..ముఖ్యమంత్రి బదిలీ చేస్తారు..డిప్యూటీ సిఎం పోస్టింగ్‌ ఇస్తారు..ఇందులో ఎవరిది కరెక్టో..వారిద్దరే చెప్పాలి...!

(901)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ