WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ప్రచారం వెనుక...అధికారపార్టీ నేతలు...!

జిల్లాలో పనిచేసే ఏ అధికారి అయినా..ఏ ఉద్యోగి అయినా...కష్టపడి పనిచేసి ప్రజాభిమానం పొందేవారిని మాత్రమే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రోత్సహిస్తున్నారు. కొంత మంది అధికారులు, ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకుండా కలెక్టర్‌ తమను అన్యాయంగా తిడుతున్నారని చేస్తోన్న ప్రచారాన్ని మెజార్టీ ఉద్యోగులు నమ్మడం లేదు. ఈ ప్రచారం వెనుక కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రభావం ఉందని, మహిళా మంత్రి కూడా వీరికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. పనిచేసే ఉద్యోగులను కలెక్టర్‌ ఎందుకు తిడతారు..? సకాలంలో కార్యాలయానికి రాకుండా..లంచాలు తీసుకుంటూ...ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నవారినే కలెక్టర్‌ హెచ్చరిస్తున్నారే తప్ప...పనిచేసే వారి జోలికి ఆయన వెళ్లరని ఉద్యోగులు చెబుతున్నారు. ఒక పనిని నిర్ణీత కాలవ్యవధిలో పనిచేయించాలని కలెక్టర్‌ భావిస్తుంటారని అయితే ఆయా పనులు చేయకుండా నెలలు తరబడి జాప్యం చేస్తుంటే...కలెక్టర్‌ మౌనంగా ఉంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆదర్శ గ్రామాల్లో అన్నీ పనులు ప్రభుత్వమే చేస్తుందని ప్రజలు భావిస్తారని..అది చాలా తప్పు అని ప్రజలను చైతన్యం చేయాలని...కలెక్టర్‌ అధికారులను ఉద్యోగులను ఆదేశిస్తున్నారు..ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. పరిష్కరించామని అబద్దాలు చెప్పే అధికారులను కలెక్టర్‌ సంజాయిషీ కోరడంలో తప్పేమిటని... తప్పుడు సమాచారం ఇచ్చేవారిని ఉపేక్షించమని కలెక్టర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రిబంవళ్లు కష్టపడుతున్నారని...అందులో సగం మనం కష్టపడ్డా...ప్రజల అభినందనలు పొందవచ్చనని సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ చెబుతున్నారు. మమ్ములను తిట్టేందుకే కలెక్టర్‌ సమీక్షా సమావేశాలు పెడుతున్నారని కొందరు ఉద్యోగులు, అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వ్యక్తిత్వం ఉన్న అధికారి ఆయన కారని, నీతినిజాయితీలు ఆయన ఇంటిపేరని కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో కలెక్టర్‌ పనితీరును అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఉద్యోగులు, అధికారులు మాట్లాడుతూ 'తాము 25నుంచి 30ఏళ్ల సర్వీసును పూర్తి చేశాం..నిజాయితీగా పనిచేసే ఇలాంటి కలెక్టర్‌ను..ఇంతకు ముందు చూడలేదు..ముందు ముందు చూస్తామన్న నమ్మకం లేదు...అటువంటి అధికారిపై దుష్‌ప్రచారం చేసేవారికి పుట్టగతులు ఉండవని...భగవంతుడు కూడా వారిని క్షమించరని మెజార్టీ ఉద్యోగలు అంటున్నారు.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ