WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వామ్మో...కృష్ణాపుష్కరాలు...!

ఆగస్టు 12వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు ఘనంగా నిర్వహించినట్లు పత్రికలు, సమాచారసాధనాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇతర ప్రాంతాల వారు ఉత్సాహపడుతున్నారట. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో ఉన్న బంధుమిత్రుల గృహాలకు ఇతర జిల్లా వారు తరలిరాబోతున్నారు. వచ్చిన వారికి మర్యాదలు బాగా చేయాలి..వెంట తీసుకెళ్లి కృష్ణాపుష్కర స్నానం చేయించాలి...కొన్ని లక్షలు మంది బంధుమిత్రులు ఈ కృష్ణా పుష్కరాలకు రాబోతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని పోలీసు అధికారులు పదే పదే చెబుతుండడంతో చాలా మంది పొరుగు జిల్లాల వారు పుష్కరస్నానాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏర్పాట్లు ఘనంగా చేశారని..ఇంతకు ముందు జరిగిన సంఘటనలు పునరావృతం కావని..పోలీసు బందోబస్తుతో పాటు వేలాదిమంది వాలంటీర్లు సేవలందిస్తున్నారని యాత్రికులకు వసతిపై ఎక్కువ దృష్టిసారిస్తున్నారని పలు టివీలు ప్రచారం చేస్తున్నాయి. పాలకులు కూడా పుష్కరస్నానాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో ప్రజలు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. పుష్కరస్నానాల ఏర్పాట్లు ఇంతకు ముందు ఎవరూ చేయలేదని...ప్రస్తుతం ఆ విధంగా చేయబోతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు 'జనంప్రతినిధి'తో చెప్పారు. అతిథుల ఆతిధ్యం కోసం రెండు జిల్లాల వాసులకు అదనపు ఖర్చు తప్పదు. ఖర్చు ఎంతైనా పెడతాం..అందరు బంధువులు ఒకేసారి వస్తే వారికి ఎలా వసతి సౌకర్యాలు కల్పించాలని కొన్ని కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికే అనేక మంది బంధువులు,మిత్రులు తాము వస్తున్నట్లు సమాచారం అందించారట. పుష్కరస్నానం పదిరోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఎవరెవరి ఇంటికి ఎంతమంది వస్తారో..వారికి ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక కొందరు ఆందోళన చెందుతున్నారట.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ