WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అనసూయ'తో 'అక్కినేని అఖిల్‌' డేటింగ్‌....!(వీడియో)

ఒక వైపు తన అన్న అక్కినేని నాగచైతన్య సినీ నటి 'సమంత'తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉంటే...తాను మాత్రం ఎందు ఖాళీగా ఉండాలని భావించాడో ఏమిటో కానీ...'అక్కినేని అఖిల్‌' కూడా యాంకర్‌ 'అనసూయ'తో డేటింగ్‌ చేస్తున్నాడంట. యువ హీరో 'అఖిల్‌' డేటింగ్‌ 'అనసూయ'తో చేస్తున్నారని వార్తలు రావడం ఇప్పుడు సినీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. యాంకరింగ్‌లో తన 'టాలెంట్‌' చూపించి సినిమాల్లో అవకాశాలు కొల్లగొట్టిన 'అనసూయ' 'అఖిల్‌'తో డేటింగ్‌ చేస్తుందట. అయితే ఇది మీరనుకుంటున్నట్లు అటువంటి డేటింగ్‌ కాదట. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌ 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందట. దీనిలో మొదట 'అక్కినేని అఖిల్‌'తో 'అనసూయ' కార్యక్రమం ప్రారంభించబోతోందట. ఈ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారం కాబోతోంది. కాగా ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారట. అయితే ఈ కార్యక్రమంలో 'అఖిల్‌' తన ప్రేమ గురించి, తన అన్న నాగచైతన్య ప్రేమ కార్యకలాపాల గురించి, తన సినిమా గురించి, రాబోయే తన రెండో సినిమా గురించి చెప్పబోతున్నాడట. మొత్తం మీద యాంకర్‌ 'అనసూయ' తన టాలెంట్‌ చూపించి కుర్రాడ్ని లైన్‌లో పెట్టేసిందని ఇటు తోటి యాంకర్లు, సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారట. అన్నట్లు ఈ కార్యక్రమ నిర్వహణకు 'అనసూయ' బాగానే వసూలు చేసిందట.



(1210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ