లేటెస్ట్

‘చంద్ర‌బాబు’కు ద్రోహం చేసిన టిడిపి నేత ఎవ‌రు...?

టిడిపి అధినేత ‘చంద్ర‌బాబునాయుడు’ తాను ఎవ‌రికైతే స‌హాయం చేస్తారో వారే ఆయ‌న‌కు ద్రోహం చేస్తార‌ని, ఆయ‌న వ‌ల్ల రాజ‌కీయాల్లో ఒక స్థాయికి వ‌చ్చి, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు అయి అవ‌స‌రం తీరిన త‌రువాత వారంతా ‘చంద్ర‌బాబు’కు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగిందట‌. ఇటీవ‌ల పార్టీ నాయ‌కుడు ఒక‌రు చావు అంచుల వ‌ర‌కు వెళ్లార‌ట‌. ఆ నాయ‌కుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న ‘చంద్ర‌బాబునాయుడు’ వెంట‌నే ఆయ‌న‌ను ఒక ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అంత‌ర్జాతీయ హాస్ప‌టల్ లో చేర్చార‌ట‌. చావుబ‌తుకుల మధ్య ఉన్న ఆ నాయ‌కుడికి ‘చంద్ర‌బాబు’ తిరిగి ప్రాణం పోయించారట‌. పెద్ద కార్పొరేట్ హాస్ప‌ట‌ల్ లో ల‌క్ష‌లాది రూపాయ‌లు వెచ్చించి ఆయ‌న‌కు వైద్యం చేయించి ప్రాణాలు నిలిపార‌ట‌. హాస్ప‌ట‌ల్ బిల్లు ల‌క్ష‌ల్లో  వ‌చ్చినా ‘చంద్ర‌బాబే’ స్వ‌యంగా చెల్లించార‌ట‌. పూర్తి ఆరోగ్యంతో హాస్ప‌ట‌ల్ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ నేత మూడు రోజుల‌కే ‘టిడిపి’ని వ‌దిలేసి వేరే పార్టీలోకి జంప్ చేశార‌ట‌. చావుబ‌తుకుల మధ్య ఉన్న నేత‌ను ‘చంద్ర‌బాబు’ కాపాడితే అత‌ను కృత‌జ్ఙ‌త లేకుండా పార్టీ ఫిరాయించార‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ‘నారా లోకేష్’ చెప్పారు. 


ట్విట్ట‌ర్ స్పేస్ సెష‌న్ సంద‌ర్భంగా గ‌త రాత్రి జ‌రిగిన స‌మావేశం సందర్భంగా ఈ విష‌యాన్ని ‘లోకేష్’ వెల్ల‌డించారు. పార్టీకి ద్రోహం చేసిన నాయ‌కుల‌ను తిరిగి పార్టీలోకి తీసుకోమ‌ని ఆయ‌న అన్నారు. కొంత‌మంది నాయ‌కుల‌కు ‘చంద్ర‌బాబు’ పెట్రోల్, డీజిల్ కూడా సొమ్ములు ఇచ్చార‌ని, మ‌రి కొంద‌రు నాయ‌కులకు ‘చంద్ర‌బాబు’ దుస్తులు కూడా కొనిఇచ్చార‌ని అటువంటి నాయ‌కులు కూడా కృత‌జ్ఙ‌త అనేదే లేకుండా పార్టీ ఫిరాయించార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజుల్లో రాజ‌కీయాల్లో విలువ‌లు లేవ‌ని, కృతజ్ఙ‌త అనేది అస‌లేలేద‌ని మూడు రోజుల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌తో తేట‌తెల్ల‌మైంద‌ని, అయినా ‘చంద్ర‌బాబు’ అటువంటివి అస‌లు ప‌ట్టించుకోర‌ని, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌ష్టాల్లో ఉంటే వెంట‌నే స్పందించి స‌హాయం చేస్తార‌ని ఆయ‌న అన్నారు. కాగా గ‌తంలో ఎంద‌రో నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు ‘చంద్ర‌బాబు’ స‌హాయం చేశారు. ఆయ‌న చేసిన స‌హాయం గురించి ఇత‌ర నాయ‌కుల వ‌లే ప్ర‌చారం చేసుకోరు. విచిత్ర‌మేమిటంటే ఆయ‌న స‌హాయం పొందిన ప్ర‌తివాడూ తిరిగి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. ఇది ‘చంద్ర‌బాబు’ దుర‌దృష్టం. కొంద‌రి రాత అంతే. కొంత మంది ఏమీ చేయ‌క‌పోయినా ..వీరుడు...శూరుడు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి కొంద‌రు వేల కోట్లు దానం చేసినా, స‌హాయం చేసినా వారికి  ప్ర‌చారం రాదు. ఇటువంటి వాటిలో రెండో కోవ‌లోకే ‘చంద్ర‌బాబు’ వ‌స్తారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ