WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కల నెరవేరలేదు కానీ...కాలు విరిగిపోయింది...!(వీడియో)

ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న ఆ క్రీడాకారుడి కల నెరవేరలేదు సరికదా...కాలు విరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో ఆదివారం నాడు అపశృతి చోటు చేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించడానికి ఓ ఫ్రెంచ్‌ జిమ్నాస్ట్‌ ఫీట్‌ చేసే క్రమంలో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని కాలు విరిగిపోయింది. పురుషుల క్వాలిఫయింగ్‌లో భాగంగా నిర్వహించిన వాల్ట్‌ జిమ్నాస్టిక్స్‌లో 'సమీర్‌' తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాక్‌ ఫ్లిప్స్‌ను పూర్తి చేసే క్రమంలో అదుపుతప్పి నేలపై పడిపోయాడు. దీంతో అతని కాలు ఒకటి పూర్తిగా విరిగిపోయింది. కాలు విరిగిన శబ్దం స్టేడియం మొత్తం వినిపించింది. అతనికి ఏమైందోనని ప్రేక్షకులంతా లేచి నిలబడి చూశారు. కింద పడిన 'సమీర్‌'ను స్ట్రైచర్‌పై హాస్పటల్‌కు తరలించారు. ఒలింపిక్స్‌ పతకం సాధించాలన్న అతని పట్టుదలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులై అతను స్టేడియం నుంచి బయటకు వెళ్లేటప్పుడు కరతాళధ్వనులతో సాగనంపారు.



(1065)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ