WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

16ఏళ్ల‌ బాలికపై 3వేలసార్లు రేప్‌...!

ఓ 16సంవత్సరాల బాలికపై ఓ దుర్మార్గుడు మూడు వేల సార్లుపైగా రేప్‌ చేశాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన 'లూయిస్‌'పై 'కీత్‌ డౌనెండ్‌(61) అనే కామాంధుడు ఏకంగా 3వేల సార్లు అత్యాచారం చేశాడు. 'లూయిస్‌'కు పదేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి ఈ ఘోరం జరిగిందట. ఆ బాలికను పలుసార్లు బెదిరించి ఆమెకు 16ఏళ్లు వచ్చే వరకు సుమారు 3వేల సార్లు రేప్‌ చేశాడు. చిన్న వయస్సులో తనపై జరుగుతున్న లైంగిక దాడిని ఆమె అడ్డుకోలేకపోయింది. అయితే 2012లో ఇటువంటి లైంగిక దోపిడీని ఎదుర్కొన్న కొందరు మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి శిక్షించడంతో 'లూయిస్‌' ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కామాంధుడు 'కీత్‌డౌనెండ్‌'ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కోర్టుకు ఈ నీచుడికి 19ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన ఇంటికి సమీంలోనే 'కీత్‌' ఉండేవాడని బాగా ధనవంతుడైన 'కీత్‌' ఇంటికి తన తండ్రి డబ్బుల కోసం పంపుతాడని, దాన్ని ఆసరాగా తీసుకున్న ఆ దుర్మార్గుడు రోజుకు రెండుసార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. తన బాల్యాన్ని దోచిన 'కీత్‌'కు మరింత పెద్ద శిక్ష పడాలని ఆమె కోరుకుంటోంది.

(1312)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ