WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెవిన్యూశాఖ అవినీతిపై 'సచివాలయం'లో చర్చ...!

రెవిన్యూశాఖలో జరుగుతున్న అవినీతిపై 'జనంఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనాలపై సచివాలయంలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. రెవిన్యూశాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఇప్పటికే 'జనంఆన్‌లైన్‌.కామ్‌' పలు కథనాలను ప్రచురించింది. రెవిన్యూశాఖ అవినీతి భాగోతంపై 'జనం' రాసిన కథనాలపై అటు ఉద్యోగులు,ఇటు సందర్శకులు, రెవిన్యూశాఖమంత్రి పేషిలో కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. వారు రాసిన కథనాల్లో వాస్తవం ఉందని కూడా పలువురు అనుకుంటున్నారు. ఈ కథనాలపై ఇప్పటికే సిఎంఒ దృష్టిపెట్టింది. ఈ అవినీతిపై సిఎంకు వారు నివేదించారు. అయితే కృష్ణా పుష్కరాల బిజీలో ఉన్న సిఎం అవి పూర్తి అయ్యాక దీనిపై దృష్టిసారించబోతున్నట్లు తెలుస్తోంది. వంద ఎకరాలను ఒక సంస్థకు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే దానిలో తమకు 50లక్షల రూపాయలు ఇవ్వాలని రెవిన్యూశాఖలో పనిచేసే క్రింది స్థాయి అధికారి వారిని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. దీనిలో డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ. కుటుంబ సభ్యుల హస్తం ఉందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు, అధికారుల పోస్టింగ్‌లు,బదిలీల విషయంలో లక్షలు చేతులు మారుతున్న వైనంపై కూడా 'జనంఆన్‌లైన్‌.కామ్‌' కథనాలు ఇచ్చింది. దీనిపై కూడా సచివాలయంలో రసవత్తర చర్చ నడుస్తోంది. పదవ తేదీన రెవిన్యూ ఉద్యోగులు 'వెలగపూడి' సచివాలయానికి వెళ్లాల్సి ఉండడంతో ఆ తరువాతే ఈ అవినీతి ఉద్యోగులపై చర్యలు ఉంటాయి. 10వ తేదీన 'వెలగపూడి' సచివాలయానికి రెవిన్యూ ఉద్యోగులందరూ తప్పనిసరిగా రావాలని ప్రభుత్వం ఆదేశింరీంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా కొందరు క్రింది స్థాయి ఉద్యోగులు విజయవాడ తరలి వెళ్లి ప్రయాణ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై 'జనం ప్రత్యేక ప్రతినిధి' ఆ కిందిస్థాయి అధికారిని కోరగా హైదరాబాద్‌ నుండి విజయవాడ వచ్చేందుకు అక్కడ నుండి వెలగపూడి వెళ్లేందుకు ఏర్పాట్లును చేయడంలో బిజీగా ఉన్నానని చెప్పారు. దీంతో సచివాలయంలో అవినీతి అధికారులపై జరుతున్న చర్చ తాత్కాలికంగా తెరపడింది. మళ్లీ 16వ తేదీన ఈ అవినీతి అధికారులపై వేటు వేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం.

(202)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ