WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రసాద్‌,అనురాధ'లపై బదిలీ వేటు...!

దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్వీ.ప్రసాద్‌ వ్యవహారశైలిపై ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో దానిపై ఆయన విచారణ జరిపించి వాస్తవాలను తెలుసుకున్నారట. దీంతో ఆయనపై బదిలీ వేటు వేయాలని నిర్ణయించారట. మంత్రిని ఖాతరు చేయరు..రాజకీయ సిఫార్సులను చెత్తబుట్టలో వేస్తారు..అంతా వన్‌మాన్‌షోగా పాలన ఉండాలని భావిస్తారు. తన సామాజికవర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తారని వారి సమస్యలను ఆగమేఘాలపై పరిష్కరిస్తూ ఇతర వర్గాల వారి సమస్యలను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ముఖ్యకార్యదర్శిపై పలువురు ఎమ్మెల్యేలు కూడా సిఎంకు ఫిర్యాదు చేశారు. గతంలో ఈ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వారందరూ ప్రజాప్రతినిధులను గౌరవించి, వారు సిఫార్సు చేసిన పనుల్లో సాధ్యమైతే పరిష్కరించేవారు...లేదంటే వాస్తవసమాచారం వారికి ఫోన్‌లద్వారా తెలిపేవారు. దానికి విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారట. ఆయన కొన్ని ఫైళ్లపై డిస్కషన్‌ అని రాస్తున్నారు...ఆయా ఫైళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఒక సమయంలో ఆయనను బదిలీ చేసి మేఘమధనం శాఖలో నియమించాలని 'చంద్రబాబు' భావించినప్పటికి అప్పటి సిఎస్‌ ఐ.వి.ఆర్‌.కృష్ణారావు అడ్డుపడ్డారు. ఇంతలో కృష్ణాపుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఎఎస్‌ అధికారి రాజశేఖర్‌ను స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించిన సిఎం 'ప్రసాద్‌' ప్రాధాన్యతను తగ్గించారు. ఈశాఖ కమీషనర్‌ 'అనురాధ' కూడా రాజకీయ నాయకుల సిఫార్సులను తేలిగ్గా తీసుకుంటారట. 'మేం చాలా నిజాయితీ పరులమని భావిస్తూ... నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారనే దానిపై సమాధానం ఇవ్వరు. మంత్రి బలహీనతలను తెలుసుకున్న ఈ ఇద్దరు ఆయనను తమ శాఖ మంత్రిగా భావించడం లేదని ఉద్యోగవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆగస్టు మాసాంతానికి ముఖ్యకార్యదర్శి 'ప్రసాద్‌, కమీషనర్‌ అనురాధను బదిలీ చేయడం ఖాయమని సిఎంఒ వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాయి.

(304)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ