వాళ్లు వస్తోంది వ్యభిచారం చేయడానికే...!

యూరోపియన్ దేశాలక నైజీరియా నుంచి వస్తోన్న మహిళల్లో దాదాపు 80శాతం మంది వ్యభిచారం చేయడానికే నని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనల్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) తెలిపింది.ఈ ఆరు నెలల్లో దాదాపు 3,600 మంది నైజీరియా మహిళలకు వచ్చారని వీరిలో ఎక్కువ మంది వ్యభిచారం చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. వీరందరూ అక్రమంగా వచ్చిన వారేనని, బోట్లలో వీరు సరిహద్దులు దాటి యూరోపియన్ దేశాలకు వస్తున్నారని పేర్కొంది. వీరందరూ ట్రాఫికింగ్‌కు గురైన వారేనని, మనుషుల అక్రమ రవాణా ముఠాలు మైగ్రెండ్ రిసెప్షన్ సెంటర్లను దీని కోసం వినియోగించుకుంటున్నారని తెలిపింది. మహిళల్ని డబ్బుల కోసం బలవంతంగా వేశ్యావృత్తిలోకి దించుతున్నారని ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. క్రిమినల్ గ్యాంగులు, మనుషుల అక్రమ రవాణా ముఠాలు నైజీరియా నుంచి యువతులను తీసుకొచ్చి ఈ నరకకూపంలోకి దించుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.