WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిలబెట్టిన 'అశ్విన్‌'...!

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ను అశ్విన్‌ ఆదుకున్నాడు. ఒక దశలో 87/4తో కష్టాల్లో ఉన్న భారత్‌ను అశ్విన్‌ (75నాటౌట్‌) నిలబెట్టాడు. దీంతో భారత్‌ ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(1)తో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (3) వెనువెంటనే వెనుదిరిగారు. ఈ స్థితిలో కేఎల్‌ రాహుల్‌(50)రహానె(35)ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగులు జత చేయడంతో భారత్‌ కోలుకుంది. అర్ధ శతకం చేసిన రాహుల్‌తో పాటు రోహిత్‌ శర్మ(9) కూడా వెనుదిరగడంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో పడింది.ఈ దశలో అశ్విన్‌, రహానే సమన్వయంతో ఆచితూచి ఆడారు. వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌ రెండో సెషన్‌లో 29 ఓవర్లను ఎదుర్కొని 1.48 రన్‌రేటుతో కేవలం 43 పరుగులు మాత్రమే చేసి వెస్టిండిస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అనంతరం మూడో సెషన్‌ ప్రారంభంలో రహానె తన వ్యక్తిగత స్కోర్‌ 35 వద్ద ఛేజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సాహా(46 నాటౌట్‌) అశ్విన్‌కు తోడుగా మరో వికెట్‌ పడకుండా సమయోచితంగా ఆడుతున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

(489)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ